
తెలుగులో అలా మొదలైంది, ఓహ్ బేబీ, కల్యాణ వైభోగమే.. తదితర సూపర్ హిట్ సినిమాలకి దర్శకత్వం వహించిన లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే నందిని రెడ్డి ఈ మధ్య మంచి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు కొంత బ్రేక్ తీసుకుంది. అయితే కొన్ని రోజులుగా డైరెక్టర్ నందిని రెడ్డి టాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ సమంతతో కలసి సినిమా చేస్తుందని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
అంతేకాదు ఈ సినిమా కంప్లీట్ గా లేడీ ఓరియెంటెడ్ అని దీంతో సమంత కోసమే కొన్ని ప్రత్యేక సన్నివేశాల్ని ప్లాన్ చేసిందని త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని టాక్ వినిపిస్తోంది. దీనికితోడు నందిని రెడ్డి పుట్టిన రోజు సమంత విషెష్ చెబుతో పోస్ట్ షేర్ చెయ్యడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి.
దీంతో డైరెక్టర్ నందిని రెడ్డి ఈ విషయంపై స్పందించింది. ఇందులోభాగంగా తాను సమంతతో చేస్తున్నట్లు వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ సమంతతో సినిమా కన్ఫర్మ్ అయితే అధికారికంగా ప్రకటిస్తామని అంతవరకూ ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చెయ్యద్దని కోరింది. దీంతో నందిని రెడ్డి, సమంత సినిమాపై వినిపిస్తున్న రూమర్స్, గాసిప్స్ కి పులిస్టాప్ పడింది.
ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది డైరెక్టర్ నందిని రెడ్డి అన్నీ మంచి శకునములే అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా థియేటర్స్ లో పెద్దగా వర్కౌట్ కాలేదు కానీ ఓటీటీలో మాత్రం బాగానే వర్కౌట్ అయ్యింది. ఈ సినిమాలో యంగ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా నటించగా మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, గౌతమీ, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు..