![90స్ టీమ్ నుంచి టీచర్](https://static.v6velugu.com/uploads/2024/04/director-naveen-medaram-producing-another-film-titled-teacher_kV5dTio1PR.jpg)
ఇటీవల ‘90స్.. ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న టీమ్ నుంచి మరో చిత్రం వస్తోంది. ఆ చిత్రాన్ని నిర్మించిన దర్శకుడు నవీన్ మేడారం.. ‘టీచర్’ పేరుతో మరో చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ‘90స్’తో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మెప్పించిన ఆదిత్య హసన్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో టీచర్‌గా టైటిల్ రోల్‌ను పోషిస్తోంది స్వాతి రెడ్డి.
తెలంగాణలోని అంకాపూర్ అనే గ్రామంలో చదువులో వెనుకబడి, అల్లరిలో మాత్రం ముందుండే ముగ్గురు విద్యార్థుల కథ ఇది. వాళ్ల జీవితాల్లో టీచర్ ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అనేది కాన్సెప్ట్. ‘బాహుబలి’ ఫేమ్ నిఖిల్ దేవాదుల, ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ నిత్యశ్రీ, రాజేంద్ర గౌడ్, సిద్దార్థ్, హర్ష, పవన్ రమేష్, నరేందర్ నాగులూరి, సురేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.