
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) టైటిల్ రోల్‌లో వచ్చిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ జైలర్ (Jailer). నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 10న విడుదలై.. అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.
నెల్సన్ దిలీప్ కుమార్..రైటర్, డైరెక్టర్ గా తమిళ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలు ప్రధానంగా క్రైమ్ మరియు యాక్షన్ జానర్‌లలో తెరకెక్కి సూపర్బ్ హిట్ సక్సెస్ ను అందుకున్నాయి. అందులో భాగంగా వచ్చిన శివ కార్తికేయన్ డాక్టర్, విజయ్ బీస్ట్ మరియు రజినీ జైలర్ చిత్రాలతో తన నెక్స్ట్ సినిమాపై భారీ అంచానులున్నాయి.
తాజాగా నెల్సన్ ఓ అవార్డు వేడుకలో తన ఫ్యూచర్ ప్లాన్ గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ ముగ్గురు స్టార్ హీరోలను స్క్రీన్‌పై చూపించడం తన కల అన్నారు.
‘ఒకవేళ నేను కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ సినిమాకు దర్శకత్వం వహిస్తే అందులో మరికొందరు..స్టార్ హీరోలను కూడా స్క్రీన్ పై చూపిస్తానని తెలిపారు. అందులో భాగంగా ఆ స్టార్ నటులెవ్వరినిది కూడా చెప్పాడు. టాలీవుడ్ నుంచి ప్రిన్స్ మహేశ్‌బాబు, బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిలకు కీలకపాత్రలు ఇస్తాను. అది నా కల
అలాగే అందులో ఫిమేల్ క్యారెక్టర్ ఉంటే తప్పకుండా నా ఫస్ట్ ఛాయిస్ నయనతారనే’ అని చెప్పారు. ఈ కాంబినేషన్‌లో కనుక నిజంగా సినిమా వస్తే బ్లాక్‌బస్టర్ అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫ్యూచర్ లో ఇది సాధ్యమయ్యేనా?
ప్రస్తుతం నెల్సన్ జైలర్ 2 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ పవర్‌ఫుల్ సీక్వెల్‌కు ‘హుకుం’(Hukum) అనే టైటిల్‌ను ఖారారు చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. ఈ సినిమాని ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం.