Maharaja: నిర్మాతలకి సూపర్ హిట్ సక్సెస్ ఇచ్చాడు.. ఖరీదైన BMW కార్ పట్టాడు..

Maharaja: నిర్మాతలకి సూపర్ హిట్ సక్సెస్ ఇచ్చాడు.. ఖరీదైన BMW కార్ పట్టాడు..

వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న మక్కల్ సెల్వన్ విజయ్‌సేతుపతి (Vijay Sethupathi) కెరీర్‌లో(VJS50)వ చిత్రం ‘మహారాజ' (Maharaja). దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ (Nithilan Saminathan) తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో కూడా విడుదలైంది. రివెంజ్ అండ్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా థియేటర్ ఆడియన్స్ ను మెప్పించింది. 

ట్విస్ట్‌లు, మ‌లుపులతో సాగే ఈ ఎమోషనల్ డ్రామా థ్రిల్లర్  జూన్ 14న థియేటర్లలో రిలీజై రూ.100కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇపుడు  ‘మహారాజ’ మూవీ 100 డేస్‌ సెలబ్రేషన్స్‌ ఆదివారం రాత్రి (అక్టోబర్ 6న) చెన్నైలో జరిగాయి. ఈ వేడుకల్లో చిత్రబృందం పాటు చీఫ్ గెస్ట్ గా హీరో జయం రవి పాల్గొన్నారు. 

ఈ సినిమాను రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడంతో.. తమకు ఇంతటి భారీ విజయాన్ని అందించిన ఆడియన్స్కి స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు మేకర్స్. అలాగే దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ కి ఓ స్పెషల్ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. అత్యంత ఖరీదైన BMW కారును హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా దర్శకుడు నితిలన్‌ స్వామినాథన్‌ కు అందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

కాగా డైరెక్టర్ నిథిలన్‌ స్వామినాథన్‌ మేకింగ్‌, రైటింగ్‌ స్టైల్‌ను సినీ ఆడియన్స్ కు బాగా నచ్చింది. ఈ సినిమా విడుదలయ్యాక తనను ఎంతోమంది ప్రశంసించారు కూడా. కథ పాతదే అయినా దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం, విజయ్ సేతుపతి నటన వెరసీ సినిమాను నెక్స్ట్ లెవల్లో నిలబెట్టాయి. దాంతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ రాబట్టింది మహారాజ మూవీ. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్‍ఫ్లిక్స్(Netflix)లోనూ దూసుకెళ్తోంది.మహారాజ సినిమాను ప్యాషన్ స్టూడియోస్,ది రూట్ థింక్ పతాకాలపై సుధాన్ సుందరం,జగదీశ్ పళనిస్వామి కలిసి నిర్మించారు.అజ్నీశ్ లోకనాథ్ సంగీతం మ్యూజిక్ ఇచ్చారు.

కథ: 
మహారాజ(విజయ్ సేతుపతి)..భార్య యాక్సిడెంట్ లో చనిపోవడంతో కూతురు జ్యోతితో కలిసి ఓ సెలూన్ నడుపుకుంటూ ఉంటాడు. అయితే యాక్సిడెంట్ తన కూతురిని ఇనుప చెత్తబుట్ట కాపాడుతుంది. అందుకే ఆ చెత్తబుట్టని లక్ష్మి అని పిలుస్తూ..ప్రేమగా చూసుకుంటాడు. కానీ, ఒకరోజు ఆ చెత్తబుట్ట కనిపించకుండా పోతుంది. వెతికిపెట్టమని పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు. ఇక మరోపక్క సెల్వం(అనురాగ్ కశ్యప్) దొంగతనాలు చేస్తూ ఉంటాడు. మరి మహారాజాకు, సెల్వంకు సంబంధం ఏంటి? ఆ చెత్తబుట్టకు లక్ష్మి అని పిలుచుకునేంత ప్రత్యేకత ఎందుకు? అనే విషయాలు తెలియాలంటే మహారాజ సినిమా చూడాల్సిందే.