విధుల్లో నిర్లక్ష్య వహించిన అధికారులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. లేటెస్ట్ గా ఐదుగురు ఏఈవోలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మంచిర్యాల జిల్లాలో ఐదుగురు ఏఈఓలను సస్పెండ్ చేస్తూ అగ్రికల్చర్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రైతు బీమా రిజిస్ట్రేషన్ లో నిర్లక్ష్యం వహించినందుకు గాను వారిపై సస్పెన్షన్ వేటు వేసినట్టు ఉత్తర్వుల్లో తెలిపారు.
సస్పెండ్ అయింది వీళ్లే..
- కాశీపెట్ శ్రీను (గురిజాల క్లస్టర్ బెల్లంపల్లి)
- సాయిని శ్రీనివాస్ (దౌడేపల్లి, లక్షెట్టిపేట్)
- సాత్రపు సాగర్( అస్నాద్, చెన్నూరు)
- దేవులపల్లి ప్రణిత(ఇందారం, జైపూర్)
- గోకర్ల తిరుపతి (మంచిర్యాల) ఉన్నారు