హనుమకొండ/ కాశీబుగ్గ, వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు, సిబ్బంది నిబద్ధతతో పని చేయాలని స్టేట్ హెల్త్ డైరెక్టర్ బి.రవీంద్ర నాయక్ అన్నారు. వరంగల్ నగరంలోని పోచమ్మకుంట అర్బన్ హెల్త్ సెంటర్ ను శుక్రవారం ఆయన హనుమకొండ డీఎంహెచ్‌వో డాక్టర్ లలితాదేవితో కలిసి సందర్శించారు. అక్కడ అందుతున్న సేవలు, వివిధ కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. పోచమ్మకుంట హెల్త్ సెంటర్ పరిధిలో ఈ ఏడాది నమోదైన డెంగ్యూ, మలేరియా, ఇతర వ్యాధులు, జ్వర సర్వే, వైద్య శిబిరాలు, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
స్లమ్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యారోగ్య సిబ్బందికి సూచించారు. మాతా, శిశు సంరక్షణ, ఎన్సీడీ, టీబీ తదితర జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరుపై ఆరా తీశారు. సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ టి.మదన్మోహన్ రావు, ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఇఫ్తాకర్ అహ్మద్, డాక్టర్లు నాగరాజు, హరిత తదితరులున్నారు.
వరంగల్‌కు వచ్చిన డీహెచ్‌ను తెలంగాణ ఫార్మాసిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్ గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కందకట్ల శరత్ బాబు మర్యాదపూర్వకంగా కలిసి, ఫార్మసిస్ట్‌ల సమస్యలపై ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన డీహెచ్ఫార్మసిస్టుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఫార్మసిస్ట్స్ అసోసియేషన్ హనుమకొండ కార్యదర్శి జి.సతీశ్, వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్.ప్రేమ్ సాగర్, ఎం.అవినాశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.