డెంగ్యూ కేసులు గతేడాది కంటే అధికం

డెంగ్యూ కేసులు గతేడాది కంటే అధికం

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో రోజురోజుకు డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని, గతేడాది కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నా యని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ (డీహెచ్) రవీందర్ నాయక్ తెలిపారు.  శనివారం కోఠిలో తన కార్యాల యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాతావరణ మార్పులతో  రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు వస్తున్నాయని చెప్పారు. 

ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 20 వరకు తెలంగాణలో 4,648 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో ఇంటింటా జ్వరసర్వే నిర్వహిస్తున్నామని వివరించారు. గతేడాదితో పొలిస్తే ఈ ఏడాది డెంగ్యూ కేసులు బాగా పెరుగుతున్నాయని ప్రకటించారు. కేసులు పెరిగిన ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లుఆస్పత్రులను విజిట్ చేస్తున్నట్టు వెల్లడించారు. చికెన్ గున్యా కేసులు కూడా బాగా పెరుగుతున్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 106 చికెన్ గున్యా కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.