ఎగ్జామ్ సెంటర్ల వద్దే టెన్త్ స్టూడెంట్లకు మిడ్డే మీల్స్ : నర్సింహారెడ్డి

ఎగ్జామ్ సెంటర్ల వద్దే టెన్త్ స్టూడెంట్లకు మిడ్డే మీల్స్ : నర్సింహారెడ్డి
  • డీఈఓలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న సర్కారు స్కూల్ స్టూడెంట్లకు పరీక్ష కేంద్రాల వద్దనే మధ్యాహ్న భోజనం అం దించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష పూర్తయిన తర్వాత భోజనం పెట్టి పంపించాలని సూచిం చారు. ఈ మేరకు డీఈఓలకు ఆయన ఆదేశాలిచ్చారు.

ఈ నెల 21న టెన్త్ పరీక్షలు ప్రారంభం కాగా.. ఉదయం ఇంటి నుంచి వచ్చిన విద్యార్థులు మళ్లీ ఇంటికి పోయే వరకు ఖాళీ కడుపుతోనే ఉంటున్నారని పేరెంట్స్, హెడ్మాస్టర్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దృష్టికి తీసుకుపోయారు. దీనికి సానుకూలంగా ఆయన స్పందించారు. ఏప్రిల్2తో ప్రధానమైన పరీక్షలు పూర్తికానుండగా, 4వరకూ ఓఎస్​ఎస్​సీ, ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి.