OTT Drama Film: ఓటీటీలోకి ఒబామా మెచ్చిన ఇండియన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? కథ ఇదే

OTT Drama Film: ఓటీటీలోకి ఒబామా మెచ్చిన ఇండియన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? కథ ఇదే

'ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌..'(All We Imagine as Light) దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించిన తొలి ఫీచర్ ఫిల్మ్ ఇది. అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో అవార్డులతో పాటుగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న చిత్రమిది.

అంతేకాదు..అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 2024 లో తన ఫేవరేట్ మూవీస్ లిస్ట్ లో ఒకటిగా నిలిచిన మూవీ కూడా. దాంతో ఎప్పుడు బిజీగా ఉండే మాజీ ప్రెసిడెంట్కు నచ్చిన సినిమాల్లో.. ఇండియన్ మూవీ ఒకటుందని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ వచ్చింది.

ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఎందుకంటారా.. అక్కడికే వస్తున్నా.. ఈ సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 2025 జనవరి 3న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలవుతుందని అధికారిక సంస్థ ప్రకటించింది.  "2024 ఫెస్టివల్ డి కేన్స్ గ్రాండ్ ప్రిక్స్ విజేత & 2 గోల్డెన్ గ్లోబ్ నామినేషన్‌లతో - పాయల్ కపాడియా తెరకెక్కించిన మాస్టర్ పీస్ - ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జనవరి 3న ప్రసారం అవుతుంది. మిస్ అవ్వకండి !" అంటూ వివరాలు వెల్లడించింది. 

ALSO READ : SreeLeela: వ్యూస్, లైక్స్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయకండి.. హీరోయిన్ శ్రీలీల ఆసక్తికర వీడియో

అరుదైన అవార్డులు:

‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌..'  మూవీ ఈ ఏడాది (2024) కేన్స్ ఉత్సవాల్లో ప్రదర్శించబడింది. దాంతో గ్రాండ్ ప్రిక్స్ అవార్డు గెలుచుకుంది. 30 ఏళ్ల తర్వాత కేన్స్ ఉత్సవాల్లో ఈ అరుదైన ఘనత దక్కించుకోవడమే కాదు 82వ గోల్డెన్ గ్లోబ్స్ పురస్కారాలకు ఈ సినిమా నామినేట్ అవ్వడం విశేషం. విభిన్నమైన కథతో డ్రామా ఫిల్మ్‌గా దర్శకురాలు పాయల్ కపాడియా దీనిని రూపొందించారు. బెస్ట్‌ నాన్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ మోషన్‌ పిక్చర్, బెస్ట్‌ డైరెక్టర్‌ విభాగాల్లో ఈ  మూవీ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులకు నామినేట్‌ అయింది.

కథేంటంటే:

కని కుశ్రుతి, దివ్య ప్రభ,ఛాయా కదమ్, హృధు హరూన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ ఏడాది నవంబర్ 22న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణతో పాటు వసూళ్లు కూడా సొంతం చేసుకుంది. 

ముంబైలో రోజువారీ జీవనం కోసం కష్టపడుతున్న ముగ్గురు మహిళల కథ. ముంబయి ఓ నర్సింగ్ హోంలో పనిచేసే కేరళకు చెందిన ఇద్దరు నర్సులు, మరియు పార్వతి అనే వంటమ్మాయి కథే ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’. అయితే ఆ నర్సులిద్దరు కలిసి ఓ బీచ్ టౌన్ కు రోడ్ ట్రిప్ వెళ్తారు. ఆ తర్వాత వారిద్దరి జీవితాలు ఎలా మారాయి.. ? అన్నదే ఈ సినిమా స్టోరీ. ఇకపోతే తెలుగులో ఈ మూవీని రానా రిలీజ్ చేశారు.