ఎందుకు మిస్ చేశావ్ అన్నా.. ఆ సీన్ పడుంటే థియేటర్స్ బద్దలయ్యేవి!

ఎందుకు మిస్ చేశావ్ అన్నా.. ఆ సీన్ పడుంటే థియేటర్స్ బద్దలయ్యేవి!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma) తెరకెక్కించిన హనుమాన్(HanuMan) మూవీ జోరు ఇంకా తగ్గడంలేదు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలై 18 రోజులు గడుస్తున్నా ఇప్పటికే హౌస్ ఫుల్ బోర్డ్స్ తో రన్ అవుతోంది ఈ మూవీ. అంతేకాదు అదే రేంజ్ కలెక్షన్స్ కూడా రాబడుతోంది ఈ మూవీ. ఇప్పటికే రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన హనుమాన్.. త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్ లో చేరనుంది. 

అయితే.. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఎక్కువగా క్లైమాక్స్ సన్నివేశం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ సీన్ చూసి ప్రేక్షకులు పరవశంతో ఊగిపోతున్నారు. విభీషణుడి మాటతో యోగనిద్ర నుండి మేల్కొన్న హనుమంతుడు.. మంచు కొండలను బద్దలు కొట్టుకొని బయటకి వస్తాడు. అక్కడి నుండి వాయు వేగంతో అంజనాద్రికి చేరుకుంటాడు. అయితే ఈ మధ్యలో చాలా పుణ్యక్షేత్రాలను చూపించాడు దర్శకుడు. వారణాసిలో ఒక ముని ధ్యానం చేస్తుండటం, అక్కడి నుండి హనుమాన్ ఆకాశంలో వేగంగా వెళ్లడంతో ఆ ముని కళ్ళు తెరవడం, పులులు కనిపించడం, అలా చాలా సీన్స్ కనిపిస్తాయి. 

అయితే.. కహనుమాన్ ఎంట్రీలో ఇప్పుడు మనం చూస్తున్న సీన్స్ కాకుండా.. వేరే సీన్స్ చేయాలని అనుకున్నారట. అయోధ్య రామ మందిరం బ్యాక్ డ్రాప్ ఆ సీన్ ఉండాలని ఓ సీన్ కూడా రాసుకున్నారట ప్రశాంత్. అయోధ్య రామ మందిరంలో ఓక పాప దీపాలను వెలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ, విలిగించలేకపోతుంది. ఆ సమయంలో హనుమాన్ రామ మందిరం పైనుండి వెళ్లడంతో.. ఒక్కసారిగా ఆ దీపాలు అన్ని వాటికవే వెలుగుతాయి. ఇలా ఆ సీన్ రాసుకున్నారట ప్రశాంత్. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ సీన్ తీయడం కుదరలేదు అని ఇటీవల పాల్గొన్న ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ. ఆ వీడియో క్లిప్ చూసిన ఆడియన్స్.. అంత మంచి సీన్ ను ఎందుకు మిస్ చేశావన్నా.. ఒకవేళ ఆ సీన్ పడుంటే థియేటర్స్ అనీ జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగిపోయేవి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Also read :- రాజకీయ పార్టీ పెట్టిన హీరో విజయ్ ఆస్తులు ఎంత..!

ఇక హనుమాన్ సినిమా విషయానికి వస్తే.. యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో సముద్రఖని, వారలక్షి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీ రోల్స్ చేశారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ రానున్న విషయం తెలిసిందే. ఇటీవలే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.