Prasanth Varma: నా యూనివర్స్‌ నుంచి త్వరలో కొత్త తేజస్సు..ప్రశాంత్ వర్మ పోస్ట్‌ మోక్షజ్ఞ కోసమేనా!: క్లారిటీ

Prasanth Varma: నా యూనివర్స్‌ నుంచి త్వరలో కొత్త తేజస్సు..ప్రశాంత్ వర్మ పోస్ట్‌ మోక్షజ్ఞ కోసమేనా!: క్లారిటీ

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కుమారుడు నందమూరి మోక్షజ్ఞ (Mokshagna) టాలీవుడ్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలా న్యూస్ వైరల్ అవుతూనే ఉన్నాయి. గ్రాండ్ లెవల్లో ఉందనున్న ఆ సినిమా కోసం చాల మంది స్టార్ డైరెక్టర్స్ పోటీపడుతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. 

ఇపుడు ఈ లిస్టులో మరో లేటెస్ట్ స్టార్ డైరెక్టర్ చేరిపోయారు. ఆ దర్శకుడు మరెవరో కాదు హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ(Prasanth Varma). అవును..ప్రశాంత్ వర్మ తన దగ్గర చాలా సూపర్ హీరో కాన్సెప్ట్స్ ఉన్నట్టుగా గతంలోనే చెప్పారు. ఆ కథల్లో ఒక సూపర్ హీరో కథను ఇప్పటికే బాలకృష్ణకు వినిపించాడట ప్రశాంత్ వర్మ.     

అయితే, తాజాగా ఓ సింహం తన పిల్లను ఎత్తుకొని చూపుతోన్న పోస్ట్‌ పెట్టిన ప్రశాంత్‌ వర్మ..‘నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని రాశారు. దీనికి ‘సింబా ఈజ్‌ కమింగ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ పెట్టారు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీని ఉద్దేశించే ప్రశాంత్‌ ఈ పోస్ట్‌ పెట్టారని అందరూ అనుకుంటున్నారు. 

ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై సెప్టెంబర్‌ 6న అధికారిక ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ఇటీవల ప్రశాంత్‌వర్మ పెట్టిన మరో పోస్ట్ కూడా సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఒక ఫొటో షేర్‌ చేస్తూ..‘ఛాలెంజ్‌ని స్వీకరిస్తున్నా’ అని రాశారు. అయితే ఈ పోస్ట్ వెనుక ఓ బడా మల్టీస్టారర్ ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవలే బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవంలో చిరు మాట్లాడుతూ.."నాకు బాలయ్యతో కలిసి ఒక ఫ్యాక్షన్ సినిమా చేయాలని ఒక కోరిక. అందుకు తగ్గ కథ రెడీ చేయాలని దర్శకులకు ఛాలెంజ్ ఇస్తున్నా" అని అన్నారు.ఈ కామెంట్స్ చేసిన మరుసటి రోజే ఛాలెంజ్ స్వీకరిస్తున్న అని ప్రశాంత్ పోస్ట్ పెట్టడం విశేషం.   

ఇక గతంలో బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ షోకి ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గా చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుండి ప్రశాంత్ వర్మపై బాలకృష్ణకు బలమైన నమ్మకం ఏర్పడింది. ఇటీవల ఆయన చేసిన హనుమాన్ సినిమా చూశాక ఆ నమ్మకం మరింత పెరిగింది. అందుకే.. తన వారసుడిని ఎంట్రీ సినిమాను ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టాలని ఫిక్స్ అయ్యాడట బాలకృష్ణ. అయితే.. ప్రస్తుతం రూమర్ గానే ఉన్న ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకనట వచ్చే వరకు ఆగాల్సిందే.