PVCU3: హనుమాన్ విశ్వం నుండి 'మ‌హా కాళీ'.. తొలి మ‌హిళా సూప‌ర్ హీరో కథతో ప్రశాంత్ వర్మ!

PVCU3: హనుమాన్ విశ్వం నుండి 'మ‌హా కాళీ'.. తొలి మ‌హిళా సూప‌ర్ హీరో కథతో ప్రశాంత్ వర్మ!

హనుమాన్ డైరెక్టర్ క్రియేట్ చేసిన 'ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)' నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ మూవీకి 'మ‌హా కాళీ' (MAHAKALI) అనే టైటిల్‌ను ఖారారు చేశారు మేకర్స్. మ‌హా కాళీ టైటిల్ రివీల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

భార‌తీయ సినీ ప్ర‌పంచంలో మొద‌టి మ‌హిళా సూప‌ర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండ‌నున్న‌ట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మ‌హిళా ద‌ర్శ‌కురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వ‌హిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

"ఈ నవరాత్రుల శుభ సందర్భంగా.. నేను చాలా ప్రత్యేకమైన విషయాన్ని పంచుకోవడానికి థ్రిల్‌గా ఉన్నాను. అజేయమైన యోధుడు, నీతిమంతుల రక్షకుడు మరియు చెడును అంతిమంగా నాశనం చేసేవారి కథను మేము గర్వంగా అందిస్తున్నాము.. హనుమాన్ విశ్వం నుండి రాబోతుంది" అని ప్రశాంత్ వర్మ తెలిపారు. 

ALSO READ | Nara Rohit: టాలీవుడ్ హీరోయిన్తో నారా రోహిత్ ఎంగేజ్‌ మెంట్!

మ‌హా కాళీ పోస్టర్ ని గమనిస్తే.. 'ఒక అమ్మాయి తన తలను పులికి సున్నితంగా తాకినట్లు చూపించారు. బ్యాగ్రౌండ్ లో గుడిసెలు, దుకాణాలు దర్శనమివ్వడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అలాగే ఇందులో ఒక ఫెర్రిస్ వీల్ మంటల్లో చూడవచ్చు. బెంగాలీ ఫాంట్‌లో డిజైన్ చేసిన టైటిల్ పోస్టర్ మధ్యలో డైమండ్ లాంటి ఆకారాన్ని చూపించారు.  ఈ ఒక్క పోస్ట‌ర్ తో ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి. కాగా ఈ సినిమాకి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ IMAX 3Dలో భారతీయ, విదేశీ భాషలలో విడుద‌ల చేయ‌నున్నట్లు ప్రకటించారు.

ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్::

హనుమాన్ సినిమాతో నేషనల్ వైడ్ ఫేమ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma). సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.40 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.290 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో ప్రశాంత్ తన పేరుతో ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) క్రియేట్ చేసి అందులోనే వరుస సినిమాలు చేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. 

అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన హనుమాన్ సినిమాకు సీక్వెల్గా జై హనుమాన్ తెరకెక్కుస్తున్నారు. ఈసారి మరింత భారీ బడ్జెట్ తో, అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను మరింత థ్రిల్ చేయడానికి సిద్దమవుతున్నాడు. అలాగే ఈ సినిమాతో పాటు నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్షజ్ఞ‌తో కూడా ఒక సినిమా చేయ‌బోతున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ.