జై హనుమాన్ షూటింగ్ షురూ చేసిన ప్రశాంత్ వర్మ.. ఈసారి రూ.1000 కోట్లు తప్పదా.?

జై హనుమాన్ షూటింగ్ షురూ చేసిన ప్రశాంత్ వర్మ.. ఈసారి రూ.1000 కోట్లు తప్పదా.?

ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో నేషనల్ అవార్డు విన్నర్, కన్నడ ప్రముఖ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నాడు. కాగా ఇటీవలే రిషబ్ శెట్టి పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చెయ్యగా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే జై హనుమాన్ థీమ్ సాంగ్ ని యూట్యూబ్ లో విడుదల చెయ్యగా ఆకట్టుకుంటోంది.

అయితే ప్రశాంత్ వర్మ రిషబ్ శెట్టి పాత్ర గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇందులో భాగంగా జై హనుమాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి వచ్చిన రెస్పాన్స్ కి చాలా సంతోషంగా ఉందని అన్నాడు. అలాగే రిషబ్ శెట్టి కి  హనుమాన్ జీ పట్ల ఉన్న భక్తి,  అసమానమైన అంకితభావం ఈ పాత్రకి జీవం పోశాయని, చెబుతూ జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు. ఈ జై హనుమాన్ ప్రయాణాన్ని మీతో ప్రారంభించినందుకు మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు మరియు చాలా ఉత్సాహంగా ఉన్నానని ఎక్స్ లో పేర్కొన్నాడు. అలాగే జై హనుమాన్ లో రిషబ్ శెట్టి ఫోటోషూట్ కి సమయంలో తీసిన ఫోటోలను కూడా షేర్ చేశాడు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రశాంత్ వర్మ తేజ సజ్జతో తీసిన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన హనుమాన్ సినిమా దాదాపుగా రూ.350 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో జై హనుమాన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రశాంత్ వర్మ కూడా జై హనుమాన్ బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలను ఒప్పించినట్లు సమాచారం. అంతేగాకుండా ఈసారి జై హనుమాన్ ని ఫ్యాన్ ఇండియా భాషలలో రిలీజ్ చేసి రూ.1000 కోట్లు బాక్సాఫీస్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.