KGF ఫ్రాంఛైజీతో సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్(Prashanthneel)..ప్రభాస్(Prabhas) తో తెరకెక్కిస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'సలార్'(Salaar). ఇండియన్ సినీ లవర్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలున్నాయి.
రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించగా..ప్రభాస్ అభిమానులలో కొత్త ఉత్సాహాన్ని పెంచింది. ట్రైలర్ రిలీజ్ అప్డేట్తోనే ప్రభాస్ ఫ్యాన్స్కు ఆకలి తీరిపోయిన ఫీలింగ్ ఇచ్చారు మేకర్స్. అలాగే లేటెస్ట్గా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వైఫ్ లిఖిత రెడ్డి నీల్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ (Ravi Basrur) స్టూడియోలో చివరి మిక్సింగ్ సెషన్‌లు జరుగుతున్నాయని..'సలార్' ట్రైలర్‌కు తుది మెరుగులు దిద్దుతున్నామని ఆమె వెల్లడించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ థ్యాంక్స్ మేడమ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సలార్ ట్రైలర్ వచ్చే నెల 1 డిసెంబర్ 2023న రాత్రి 7:19 గంటలకు రిలీజ్ కానుంది.
ట్రైలర్ అప్డేట్ పోస్టర్లో ప్రభాస్ గంభీరంగా..ఓ జీప్పై నిల్చుని..చేతిలో గన్ పట్టుకుని..ఫైర్ చేస్తున్న స్టిల్ వీపరీతంగా ఆకట్టుకుంటోంది.ఎక్కడ చూసిన ఈ స్టిల్ ను వాల్ పేపర్ గా సెట్ చేస్తున్నారు.
ఇప్పటికే రిలీజైన టీజర్ నెక్స్ట్ లెవల్లో ఉండటంతో సలార్పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కేజిఎఫ్ ఫేమ్ రవి బాసృర్ సంగీతం అందిస్తున్నారు.