సంక్రాంతి పండుగ హనుమాన్(HanuMan) దే. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఫైనల్ విన్నర్ గా నిలిచింది హనుమాన్ మూవీ. దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prashanth Verma) తెరకెక్కించిన ఈ అద్భుతమైన సినిమాకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. ఆ రేంజ్ ఇంపాక్ట్ చూపించింది ఈ సినిమా. విమర్శకులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంత తక్కువ బడ్జెట్ తో ఆ రేంజ్ వీఎఫెక్స్ ను క్రియేట్ చేసిన ప్రేక్షకులకు హనుమాన్ దర్శనం అయ్యేలా చేశాడు ప్రశాంత్ వర్మ.
ఇక ఈ సినిమాను చూసిన చాలా మంది సెలెబ్రెటీస్ హనుమాన్ సినిమాపై తమ అభిప్రాయాన్ని, రివ్యూను ఇస్తున్నారు. అయితే హనుమాన్ మూవీకు వచ్చిన అన్ని రివ్యూలలో ఒక స్పెషల్ రివ్యూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్పెషల్ అని ఎందుకు అన్నామంటే.. హనుమాన్ సినిమాపై ఆ రివ్యూ ఇచ్చింది మరెవరో కాదు ఆ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ తండ్రి. అవును తన కొడుకు సినిమా చూడటానికి మాములుగా సినిమాకు వచ్చిన ఆయన.. ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. హనుమాన్ సినిమా తీసినోడు తన కొడుకే. సినిమా చాలా అద్భుతంగా ఉంది. మూవీలోని ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంది. పార్ట్ 2లో ఏకంగా హనుమాన్ మీదే సినిమా చేస్తున్నారని చెప్పి ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచేశారు. సినిమా చూశాక ఇలాంటి ఫీలింగ్ ముందెప్పుడూ కలుగలేదు అనిపించింది.. అంటూ తన కొడుకు సినిమా గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.