Puri- Vijay: పూరి జ‌గ‌న్నాథ్ కొత్త మూవీకి టైటిల్ ఫిక్స్.. విజయ్ సేతుపతికి స్క్రిప్ట్ నచ్చిందా?

Puri- Vijay: పూరి జ‌గ‌న్నాథ్ కొత్త మూవీకి టైటిల్ ఫిక్స్.. విజయ్ సేతుపతికి స్క్రిప్ట్ నచ్చిందా?

దర్శకుడు పూరి జగన్నాథ్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబోలో ఓ మూవీ వస్తున్నట్లు టాక్. ప్రముఖ నివేదికల ప్రకారం, డైరెక్టర్ పూరి తాను రాసుకున్న స్టోరీని విజయ్తో చర్చించగా సింగిల్ సిట్టింగ్ లోనే ఒకే అయినట్లు తెలుస్తోంది. పూరి చెప్పిన స్టోరీ లైన్, హీరో క్యారెక్టరైజేషన్ విజయ్కు తెగ నచ్చేసినట్లు కథనాలు ఊపందుకున్నాయి. పాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో తెలుగు, త‌మిళంతో పాటు ఇత‌ర భాష‌ల్లో ఈ మూవీ రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం.

పూరి-విజయ్ టైటిల్:

పూరి-విజయ్ కాంబోలో రానున్న సినిమాకు గాను టైటిల్ కన్ఫార్మ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు 'బెగ్గ‌ర్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగు, త‌మిళ భాష‌ల‌కు సూట‌య్యేలా ఈ టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు వార్తా హల్చెల్ చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఈ ఏప్రిల్ నెలాఖ‌రున లేదా మే నెల‌లో ఈ మూవీ లాంఛ్ కానున్న‌ట్లు స‌మాచారం. ఇకపోతే, రెగ్యూలర్ డ్రగ్స్ నేపథ్యంలో కాకుండా క్రైమ్‌‍తో ముడిపడిన యాక్షన్ థ్రిల్లర్‌ని పూరి రూపొందిస్తున్నట్లు మరో టాక్ కూడా ఉంది. 

పూరి, విజయ్ల ప్రయోగాలు:

పూరి, విజయ్ లకు తమ సినిమాలతో ప్రయోగాలు చేయడం చాలా ఇష్టం. విజయ్ తన గత సినిమాలను చూసుకుంటే ప్రతి పాత్రలో చక్కని వైవిధ్యాన్ని కనబరుస్తారు. పాత్ర నచ్చితే, ఎంతటి కష్టమైన అందులో పరకాయ ప్రవేశం చేస్తాడు.

ALSO READ | స్టార్ హీరోకి క్యాన్సర్ అంటూ ప్రచారం.. అసలు నిజం ఏంటంటే..?

అలాగే, పూరి ఒక రచయిత-చిత్రనిర్మాత, దర్శకుడిగా ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ని క్రియేట్ చేస్తూ వచ్చాడు. ఒక నటుడిలో ఇప్పటివరకు కనిపించని కోణాన్ని తెరపై చూపించడానికి ఎప్పుడు ఆలోచిస్తాడు. బహుశా, ఈ అంశం ఇద్దరినీ కలిపి ఉండవచ్చని తెలుస్తోంది. అయితే, ఈ అరుదైన కాంబో కన్ఫామ్గా వస్తోందని క్లారిటీ అయితే లేదు. పూరి కాంపౌండ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు సస్పెన్స్ అనే చెప్పాలి.

హిట్ అవసరం:

ప్రస్తుతం డైరెక్టర్ పూరి జగన్నాథ్కు హిట్ అవసరం, లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో భారీ డిజాస్టర్స్ అందుకున్నాడు. దాంతో పూరి దర్శకుడిగా పనై పోయిందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

అంతేకాకుండా ఒక కథకుడిగా, దర్శకుడిగా, మాటల రచయితగా అప్పటి అంత స్పార్క్ కనిపించట్లేదని ఫ్యాన్స్ సైతం చర్చించుకుంటున్నారు. ఏదేమైనా పూరి తన కొత్త సినిమాతో కంబ్యాక్ ఇస్తే తప్ప ఈ కామెంట్స్ ఆగేలా లేవు. చివరివరకు ఏమవుతుందో చూడాలి.