పూరి జగన్నాథ్ కి ఆ తమిళ్ హీరో అయినా హిట్ ఇస్తాడా..?

పూరి జగన్నాథ్ కి ఆ తమిళ్ హీరో అయినా హిట్ ఇస్తాడా..?

ఒకప్పుడు మంచి లవ్ & ఫ్యామిలీ యాక్షన్ సినిమాలతో అలరించిన సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మధ్య వరుసస్ ఫ్లాపులు అందుకుంటున్నాడు. ఆమధ్య వచ్చిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ నిరాశకి గురయ్యారు. అయితే పూరి జగన్నాథ్ మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో పవర్ఫుల్ యాక్షన్ స్టోరీ ని రెడీతో మళ్ళీ ఆడియన్స్ ని అలరించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. దీంతో తెలుగు హీరోలని అప్రోచ్ అవుతున్నప్పటికీ రెస్పాండ్ అవట్లేదు. 

అయితే ఉగాది రోజున పూరి జగన్నాథ్ తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు. తమిళ స్టార్ విజయ్ సేతుపతితో దిగిన ఫోటోలని షేర్ చేశాడు. దీంతో విజయ్ సేతుపతితో సినిమా కన్ఫర్మ్ అయినట్లు చెప్పకనే చెప్పాడు. అయితే ఈ ఫొటోలో వెటరన్ హీరోయిన్ ఛార్మీ కూడా కనిపించింది. దీంతో పూరి కనెక్ట్స బ్యానర్ పై ఛార్మీ ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో దబ్ చేసి రిలీజ్ చేసేందుకు పూరి జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఏదేమైనప్పటికీ పూరి జగన్నాథ్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తుడటంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తన్నారు. అయితే ఇదే స్టోరీ ని మ్యాచో స్టార్ గోపిచంద్ కి కూడా పూరి జగన్నాథ్ వినిపించినట్లు సమాచారం. మరి ఈ సినిమాలో గోపిచంద్ నటిస్తున్నాడో లేదో అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.