ఉస్తాద్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ డబల్ ఇస్మార్ట్ (Double Ismart).టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ (Sanjay Dut) విలన్గా చేస్తున్నారు. ఆగస్ట్ 15న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆదివారం ఆగస్ట్ 11న వరంగల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్బంగా డైరెక్టర్ పూరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
"హాయ్ ఎవ్రీ వన్. మీ ఊరు రాకుండా..మిమ్మల్ని కలవకుండా మా సినిమాలు రిలీజ్ అవ్వవ్. డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. డబుల్ ఇస్మార్ట్ గురించి మాట్లాడాలంటే ఒకే ఒక పేరు..హీరో రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్, డబుల్ ఇస్మార్ట్ కలిపితే..రామ్ పోతినేని ఎనర్జీ" అని పూరీ అన్నారు.
అలాగే హీరో రామ్‌ని సెట్స్‌లో చూసిననప్పుడు తనలో ఒక కసి కనిపిస్తుంటుంది. అది నన్ను చాలా ఎగ్జయిట్ చేస్తుంది. తన క్యారెక్టర్, హెయిర్ స్టయిల్, నడక, తెలంగాణ స్లాంగ్..ఇవన్నీ తను అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడం వలనే అవుతుంది. తను వెరీ గుడ్ యాక్టర్ మాత్రమే కాదు బెస్ట్ డ్యాన్సర్ కూడా. రామ్ పోతినేని లేకపోతే ఇస్మార్ట్ శంకర్ లేడు. ఆల్వేస్ థాంక్యూ రామ్".
అలాగే "ఛార్మి కౌర్ మా కంపెనీ స్ట్రెంత్. ఏదైనా పని చెబితే చేసుకొస్తుంది. ప్రతి సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఫిలిం మేకింగ్‌లో చాలా హార్డ్ టైమ్స్ ఉంటాయి. అన్నీట్లో తను స్ట్రాంగ్ గా నిల్చుంది. ఇకపోతే విష్ రెడ్డి (పూరి కనెక్ట్స్ సీఈవో) ఎప్పుడు ఛార్మి వెనుక నిల్చుంటాడు. విష్ మా సినిమా మేకింగ్ కి పెద్ద పిల్లర్. నా దగ్గర రూపాయి లేకపోయినా రోడ్డుమీద ఉన్నా నేను వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. నా వెనుక విషు నిల్చొని ఉంటాడనే ధైర్యం అని పూరి జగన్నాథ్ చెప్పారు.
విష్ రెడ్డి ప్రముఖ నటుడు,నిర్మాత, శిక్షణ పొందిన మార్షల్ ఆర్టిస్ట్. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో ప్రతి రంగంలో టాలెంట్ ఉన్న యాక్టర్. అతను 2009లో 'జోష్' సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. కరణ్ జోహార్ తన బాలీవుడ్ ఎంట్రీకి మార్గదర్శకత్వం వహించడంతో ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పాన్ ఇండియా మూవీ 'లైగర్' తో పాటు పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు.