సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్స్ పేర్లు వెంటనే తెలియకున్నా, వారు తీసే మూవీస్ మాత్రం ఆడియన్స్కి కనెక్టింగ్ గా ఉంటాయి.అటువంటి డైరెక్టర్స్ లిస్ట్ లో రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityayan) ఒకరు. అతను తీసిన రెండు మూవీస్ బాక్సాపీస్ వద్ద సక్సెస్ అయ్యాయి. అంతే కాకుండా తాను ఎంచుకున్న స్టోరీస్కి సినీ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి.
ఇప్పుడు లేటెస్ట్గా ఈ డైరెక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) తో మూవీ తీస్తున్నట్లు తెలుస్తోంది. పీరియాడికల్ డ్రామా స్టోరీతో కథను రాసుకున్న రాహుల్..రీసెంట్గా ఎన్టీఆర్కి స్టోరీ వినిపించినట్లు సమాచారం.ఈ కథలో ఎమోషన్స్తో పాటు..బలమైన సందేశం కూడా ఉంటుందని తెలుస్తుంది.
ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు టాక్. త్వరలో ఈ కాంబోకి సంబంధించిన మరిన్ని డీటైల్స్ మేకర్స్ ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ మూవీ సెట్ అయ్యి..హిట్ కొడితే మాత్రం రాహుల్ సంకృత్యాన్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్లో చేరడం కన్ఫర్మ్.
ఎన్టీఆర్..రాహుల్ కాంబోపై ఇప్పటికే చాలాసార్లు న్యూస్ వినిపించింది. లేటెస్ట్ గా మరోసారి ఎన్టీఆర్ నటించబోయే సినిమాల గురించి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సెర్చ్ చేస్తుండటంతో ఈ కాంబోకి బలం చేకూరింది.
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో వస్తోన్న దేవర మూవీతో బిజీగా ఉన్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ వార్2 లో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ మూవీ చేస్తున్నారు. ఇక ఈ మూవీస్ కంప్లీట్ అయ్యాకే..రాహుల్ మూవీ స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.
రాహుల్ సంకృత్యాన్ గత మూవీస్ విషయానికి వస్తే..విజయ్ దేవరకొండతో టాక్సీవాలా సినిమా చేసి హిట్ అందుకున్నారు. కామెడీ. సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ని ఆకట్టుకుంది. అంతేకాకుండా టాక్సీవాలా మ్యూజికల్ హిట్గా నిలిచింది.
అలాగే నాని కెరీర్లోనే మంచి సామాజిక సందేశంతో వచ్చిన శ్యామ్ సింగ రాయ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.అలా రాహుల్ ఎంచుకున్న స్టోరీస్ని తెరకెక్కించడంలో సక్సెస్ అవ్వడంతో పాటు..కమర్షియల్ హిట్ కూడా అందుకున్నారు.