
ప్రస్తుతం ఇండియా నుండి వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ హైపుడ్ మూవీ ఏదైనా ఉందంటే అది మహేష్(Mahesh babu), రాజమౌళి(Rajamoulli) కాంబోలో వస్తున్న మూవీ (SSMB29) అని చెప్పాలి. మూవీ ప్రకటన తప్ప ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా రాకపోయినా..ఇండియన్ సినీ ఫ్యాన్స్ వేరే లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎంతలా అంటే.. ప్రతిదీ తెలుసుకునేంతలా.. సినిమా కోసం రాజమౌళి వ్యూహాలు తెలిస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేంతలా!
లేటెస్ట్ విషయానికి వస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి, మహేష్ సినిమా కోసం తన టీమ్‌తో కలిసి సౌతాఫ్రికా వెళ్లినట్లు తెలుస్తోంది. SSMB29 ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అడ్వెంచర్ యాక్షన్ మూవీ కావడంతో, ఎక్కువ భాగం అడవుల్లోనే షూటింగ్ ప్లాన్ చేసేలా పక్క ప్రణాళికతో రెడీ అయ్యారు. SSMB29 టీమ్ అంతా ప్రీ ప్రొడక్షన్ పనులపైనే ఉంది.
ఈ నేపథ్యంలో రాజమౌళి దక్షిణాఫ్రికాలో కొన్ని దట్టమైన అడవుల్లో తన బృందంతో కలిసి రెక్కీ నిర్వహిస్తున్నారు. మొన్నటికీ మొన్న తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ పోస్ట్ చేసిన ఫొటోలో రాజమౌళి జీపులో పయనిస్తూ అడవిని గమనించడం చూశాం.
ఇక తాజాగా డైరెక్టర్ రాజమౌళి స్వయంగా ఓ ఫోటోని పోస్టు చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చారు. ‘కనుగొనడం కోసం తిరుగుతున్నా’ అని ఫోటోకి క్యాప్షన్ పెట్టడంతో మహేష్ ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. దాంతో త్వరలోనే అప్డేట్ షేర్ చేయాలని మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా వరల్డ్ సినీ ఫ్యాన్స్ కోరుతున్నారు. కాగా మునుపెన్నడు చూడని విధంగా ఇండియన్ స్క్రీన్‌పై అదిరిపోయే లొకేషన్స్‌లో రాజమౌళి ఈ సినిమాని షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
లొకేషన్స్ వేటలో #SSRajamouli#SSMB29 #MaheshBabu pic.twitter.com/Drh9DqDku6
— Ramesh Pammy (@rameshpammy) October 29, 2024
ఇకపోతే హై-వోల్టేజ్ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ నటించనుందని తెలుస్తోంది. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండగా..కీరవాణి మ్యూజిక్ సమకూరుస్తున్నారు. రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.