
స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి టార్చర్ పెడుతున్నాడు.. కొన్నేళ్లుగా బాధలు భరిస్తూ ఉన్నా.. ఇక నా వల్ల కాదు.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ శ్రీనివాసరావు అనే వ్యక్తి పోలీసులకు కంప్లయింట్ చేయటం.. ఓ వీడియో రిలీజ్ చేయటం సంచలనంగా మారింది. యు.శ్రీనివాసరావు ఆడియో చెప్పిన విషయాలు షాకింగ్ కు గురి చేస్తున్నాయి. నిజమా కాదా అనేది పోలీసులు విచారణ చేసి క్లారిటీ ఇవ్వాలి లేదంటే రాజమాళి నోరు విప్పాల్సిందే.
పోలీసులకు యు.శ్రీనివాసరావు రాసిన లేఖ, విడుదల చేసిన ఆడియోలోని ఆరోపణలు ఇలా ఉన్నాయి. యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేశానని.. తామిద్దరం స్నేహితులమని.. ఒక అమ్మాయి కారణంగా దూరమయ్యామని వీడియోలో చెప్పుకొచ్చాడు.
తమది ఆర్య సినిమాలో మాదిరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని.. రాజమౌళి కోసం కాంప్రమైజ్ అయ్యానంటూ పోలీసులకు రాసిన లెటర్ లోనూ స్పష్టంగా చెప్పటం జరిగింది శ్రీనివాసరావు. రాజమౌళి నెం.1 డైరెక్టర్ అయ్యాక.. తమ లవ్ స్టోరీ ఎవరికో చెప్పాననే అనుమానంతో వేధిస్తున్నాడని.. ఇండస్ట్రీలో లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడంటూ చెప్పకొచ్చాడు శ్రీనివాసరావు. ఈ వయసులో ఈ వేధింపులు భరించలేనని.. తన చావుకు రాజమౌళి కారణం అంటూ సూసైడ్ లెటర్ విడుదల చేశాడు శ్రీనివాసరావు. ఆధారాలు కావాలంటే అడగవచ్చునంటూ.. పలువురు సినీ ప్రముఖుల పేర్లు లెటర్ లో ప్రస్థావించాడు.
Also Read:-కొడుకును పరిచయం చేసిన స్టార్ కొరియోగ్రాఫర్..
యు.శ్రీనివాసరావు రాసిన సూసైడ్ లెటర్ పై పోలీసులు ఇప్పటి వరకు స్పందించలేదు. రాజమౌళి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సూసైడ్ లెటర్ వైరల్ అయ్యింది.
సూసైడ్ లేఖ, వీడియో రిలీజ్ చేసిన యు.శ్రీనివాసరావు ఇంతకీ బతికే ఉన్నారా లేదా.. ఆయన్ను కాపాడారా లేదా.. అసలు ఆయన ఎక్కడ ఉన్నారు అనేది కూడా ఉత్కంఠగా.. సస్పెన్స్ గా మారింది. ఈ విషయంపైనా క్లారిటీ రాలేదు ఇప్పటి వరకు.
Director S.S. Rajamouli Caught in Controversy
— Hyderabad Mail (@Hyderabad_Mail) February 27, 2025
Renowned filmmaker S.S. Rajamouli faces shocking allegations from his longtime friend, U. Srinivas Rao. In a sensational claim, Srinivas Rao stated through a selfie video and a letter that he was driven to the brink of suicide due to… pic.twitter.com/mXcDxozl7R