ఫైనల్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లిన రామ్ గోపాల్ వర్మ.. ఏం జరిగిందంటే..?

ఫైనల్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లిన రామ్ గోపాల్ వర్మ.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఎదో ఒక వివాదంతో సావాసం చేస్తుంటాడు. అలాగే కేసులు పెట్టి విచారణకి పిలిచినా కూడా ఏమాత్రం ఖాతరు చెయ్యడు. కానీ శుక్రవారం (ఫిబ్రవరి 7)  ఉదయం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. రామ్ గోపాల్ వర్మను ఆయన న్యాయవాది సమక్షంలో సీఐ శ్రీకాంత్ విచారించారు. విచారణ అనంతరం పలువురు లోకల్ వైసీపీ నాయకులు అర్జీవిని కలసి మాట్లాడారు.

అయితే గత వైసీపీ ప్రభుత్వంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే సినిమాలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నారా బ్రాహ్మణి, తదితరులతోపాటూ ఇతర  టీడీపీ నాయకులను వ్యంగంగా సన్నివేశాలు తీశారని గతేడాది ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో అప్పటినుంచి విచారానికి రావాలని పోలీసులు పిలుస్తున్నప్పటికీ రామ్ గోపాల్ వర్మ మాత్రం పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా ప్రస్తుతం తనకి పనులు ఉన్నాయని ఫ్రీ అయ్యాక వస్తానని రెండుమూడు సార్లు చెప్పాడు. అలాగే ఈ విషయంపై హైకోర్టుకి కూడా వెళ్ళాడు. కానీ ఏమైందోఏమోగానీ మళ్ళీ రామ్ గోపాల్ వర్మ పోలీసుల ఎదుట విచారణకి హాజరవవడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

ALSO READ | మోనాలిసానా మజాకా: రూ. 35 వేల కోసం వెళ్తే.. 35 లక్షల ఆఫర్ వచ్చింది

ఈ విషయం ఇలా ఉండగా రామ్ గోపాల్ వర్మపై ఏపీ ఫైబర్ నెట్ నిధుల్ని దుర్వినియోగం చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఐతే రామ్ గోపాల్ వర్మ వైసీపీ ప్రభుత్వంలోని కొందరు నాయకుల అండతో వ్యూహం సినిమా ప్రసారం కోసం కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఈ అంశంపై కూడా క్లారిటీ ఇవ్వాలని టీడీపి నాయకులు కేసు పెట్టారు. దీంతో కోర్టు కూడా వివరణ ఇవ్వాలంటూ ఆర్జీవికి సమన్లు జరీ చేసింది..