ఆర్జీవీ కొత్త సంవత్సరం 7 తీర్మానాలు: అమ్మాయిల వైపు చూడను.. వోడ్కా తీసుకోను..దేవుడికి భయపడతా

ఆర్జీవీ కొత్త సంవత్సరం 7 తీర్మానాలు: అమ్మాయిల వైపు చూడను.. వోడ్కా తీసుకోను..దేవుడికి భయపడతా

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) అనుకున్నట్టే న్యూ ఇయర్ స్పెషల్ ప్రామిస్ చేశాడు. విమర్శలంటేనే నాకిష్టం ..పొగడ్తలు బోర్ కొట్టేస్తాయి అని అనుకునే నైజాం వర్మది.

ఈ కొత్త సంవత్సరం (2025) సందర్భంగా తనదైన శైలిలో నెటిజన్స్కి విషెష్ తెలిపారు. అంతేకాదు.. తన శైలిని మార్చుకోబోతున్నట్లు 7 పాయింట్లతో ప్రామిస్ కూడా చేశాడు. ఆ ప్రామిసెస్ ఏంటో చూస్తే ఇది జరిగినట్టేనా! అని సందేహం వస్తోంది. అవేంటో చూసేయండి..

1. నేను వివాదాలకు దూరంగా ఉంటాను 

2. నేను కుటుంబ వ్యక్తిని అవుతాను 

3. నేను ఇకపై దేవుడికి భయపడతాను

4. ప్రతి సంవత్సరం 10 సత్య వంటి సినిమాలు చేస్తాను

5. ఇకపై ఏ అంశంపైనా ఐన ట్వీట్ చేయడం మానేస్తాను

6. నేను అమ్మాయిల వైపు అసలే చూడను

7. నేను వోడ్కా తీసుకోవడం మానేస్తాను

ఇవి ఖచ్చితంగా పాటిస్తానని "నా మీద తప్ప అందరిపైనా ప్రమాణం చేస్తున్నాను.. హ్యాపీ ఓల్డ్ ఇయర్" అంటూ ఆర్జీవీ ట్వీట్ ఆసక్తి పెంచుతోంది. 
 
ఆర్జీవీ.. ఇండస్ట్రీలోనే ప్రత్యేకమైన పేరు. ఆ పేరు వెనుకాల ఉండే విజన్ చాలా అరుదు. అందుకు తగ్గట్టుగానే తన ట్వీట్స్, తన మాటలు, తాను తీసే సినిమాలు, ఇచ్చే ఇంటర్వ్యూలు.. ఇలా ప్రతిదీ దేనికదే విభిన్నం. తనలాంటి విజన్స్ మరే ఏఒక్కరికి ఉండదనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే, ఈ 7 తీర్మానాలను ఆర్జీవీ పాటించడం కష్టమనే చెప్పాలి. చూడాలి. రేపు చేసే ట్వీట్ ఏంటనేది!