RGV చెప్పిన కథ : సుబ్బారావు ఇడ్లీలకు.. పుష్ప సినిమా టికెట్ రేట్లకు లింక్ ఏంటీ..

RGV చెప్పిన కథ : సుబ్బారావు ఇడ్లీలకు.. పుష్ప సినిమా టికెట్ రేట్లకు లింక్ ఏంటీ..

రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma).. లాజిక్ తో కొడతాడని అందరికీ తెలుసు.. లేటెస్ట్ గా పుష్ప సినిమా టికెట్ల రేట్లపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై స్పందించారు. దీనికో ఇడ్లీ కథ చెప్పారు.. పుష్ప 2 ఇడ్లీలు అంటూ.. సుబ్బారావు హాటల్ ఇడ్లీల కథను లింక్ చేస్తూ.. పుష్ప టికెట్ ధరలపై తనదైన స్టయిల్ లో వివరించారు. ఇంతకీ వర్మ చెప్పిన సుబ్బారావు ఇడ్లీల కథతో.. పుష్ప టికెట్ల రేట్లపై అభిప్రాయం మారుతుందా లేదా.. అసలు సుబ్బారావు ఇడ్లీల కథ ఏంటో మీరే చదవండీ.

పుష్ప 2 ఇడ్లీలు అని మొదలు పెట్టి:

" సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు.కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు  సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదు.

'సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజల అందుబాటులో లేదు.. అని ఎవరైనా ఏడిస్తే , అది “సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు” అని ఏడ్చినంత వెర్రితనం. ఒకవేళ 'సెవెన్‌స్టార్ హోటల్‌లో అంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాం” అని వాదిస్తే, పుష్ప 2 విషయంలో ఆ సెవెన్‌స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమా ఏ డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్  డిఫరెన్స్  మీదే పనిచేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్ లాగే  సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి, అంతే కానీ ప్రజా సేవ కోసం కాదని' వివరణ ఇచ్చారు. అలాగే అప్పుడు లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే  ఎందుకు ఏడుస్తున్నారు ?

ఎంటర్టైన్మెంట్ నిత్యావసరమా? 

ఇల్లు, తిండి, బట్టలు ఈ  మూడింటి  కన్నా  ఎక్కువ అవసరమా? అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ వున్నప్పుడు, ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే. అలా అనుకొని వారు చూడటం మానెయ్యొచ్చూ, లేదా తర్వాత రేట్లు తగ్గక చూసుకోవచ్చు కదా?

మల్లి సుబ్బారావు హోటల్ చైన్ విషయం కొస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది.. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బారావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకడం లేదు, అన్ని సీట్లు బుక్ అయిపోయాయి!" అంటూ ఆర్జీవీ పోస్టులో కథ రూపంలో వెల్లడించాడు.

అయితే.. పుష్ప-2 మరికొన్ని గంటల్లో ఆరు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.

అయితే పుష్ప 2 సినిమా చూడాలంటే ప్రేక్షకుడి జేబుకి చిల్లు పడేలా ఉన్నాయి టికెట్ల ధరలు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి మహా నగరాలలో ప్రీమియం థియేటర్లలో టిక్కెట్ ధరలు రూ.1000 నుండి రూ.1,800, రూ.2,400 వరకు ఉండగా.. ఇతర మల్టీప్లెక్స్‌లలో 10-15% రేట్లు పెంచినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముంబైలోని ఓ థియేటర్ లో లగ్జరీ క్లాస్ టికెట్ ధర రూ.3000 ఉన్నట్లు టాక్. 

ఈ నేపథ్యంలో సామాన్య ఆడియన్స్ నుంచి మొదలు టికెట్ల రేట్లపై అసంతృప్తి వ్యక్తం అవుతుంది. దీంతో ఇష్టం వచ్చినట్లు పెంచేస్తే ఎట్లా అని సినీ ఆడియన్స్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.