సమంత, నాగచైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ సంచలనంగా మారియి. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖులు ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఈ క్రమంలో విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా మంత్రి కొండా సురేఖపై మండిపడ్డారు. నాగార్జున కుటుంబాన్ని అత్యంత హార్రిబుల్ గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకి నేను షాక్ అయ్యానని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే ఇన్‌టర్‌ఫేర్ అయ్యి ఇలాంటివి మళ్లీ జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపు రామ్ గోపాల్ వర్మ కోరారు. మంత్రి కొండా సురేఖ 4th గ్రేడ్ వెబ్‌సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి, తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్‌తో మీడియా ముందు అరచి చెప్పటం దారుణమని ట్వీట్ చేశారు.
ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్యలాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, ఇండస్ట్రీ గర్వించదగ్గ మహా నటి సమంత లాంటి వారి మీద అంత నీచమైన మాటలనంటాన్ని తీవ్రంగా ఖండించాలని ఎక్స్ లో పేర్కొన్నారు. KTRని దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించటంలో అర్ధమేంటో.. కనీసం ఆవిడకైనా అర్ధమయ్యుంటుందో లేదో కానీ, నాకర్ధమవ్వటంలేదు ? అంటూ వర్మ తనదైన స్టైల్ లో విమర్శించారు.
తనని రఘునందన్ ఇష్యూ లో ఎవరో అవమానించారనీ అసలు ఆ ఇష్యూతో ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున, నాగ చైతన్యలని అంతకన్నా దారుణంగా అవమానించటమేంటి? అని వర్మ ప్రశ్శించారు. తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికీ మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్ మీదకి లాగడం ఏ మాత్రం భరించరానిదని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అన్నారు. గతంలో రామ్ గోపాల్ వర్మ కొండా అనే పేరుతో మంత్రి కొండా సురేఖ భర్త మురళి బయో పిక్ తీసిన విషయం తెలిసిందే.
ALSO READ : నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోం.. కొండా సురేఖ వ్యాఖ్యలపై NTR
4th గ్రేడ్ వెబ్‌సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్‌తో మీడియా ముందు అరచి చెప్పటం దారుణం
— Ram Gopal Varma (@RGVzoomin) October 3, 2024
ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్యలాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహా నటి మీద… https://t.co/rMpA6UL798