అల్లు అర్జున్ బాహుబలి కాదు... మెగాబలి అంటూ ఆర్జీవీ సంచలన ట్వీట్..

అల్లు అర్జున్ బాహుబలి కాదు... మెగాబలి అంటూ ఆర్జీవీ సంచలన ట్వీట్..

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఎదో ఒక కాంట్రవర్సీలో నిలుస్తుంటాడు. ఈ క్రమంలో తనని కొందరు పొగుడుతుంటే మరికొందరు మాత్రం దారుణంగా విమర్శిస్తుంటారు.  కానీ ఆర్జీవీ వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకెళుతుంటాడు. అయితే ఈ మధ్య ఆర్జీవీ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటున్నాడు. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 

అయితే సోమవారం అల్లు అర్జున్  పుష్ప 2 : ది రూల్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ ఎమోషనల్ గా స్పీచ్ ఇచ్చాడు. దీంతో ఆర్జీవీ మంగళవారం "పుష్ప2 మెగా క్రేజ్ అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి చెప్తోందని, హేయ్ అల్లు అర్జున్ నువ్వు బాహుబలి కాదు కానీ స్టార్స్ యొక్క మెగాబలి" అంటూ ఎక్స్ లో సెటైరికల్ గా ట్వీట్ చేశాడు. అంతేకాదు తాను ప్రస్తుతం ప్రొడ్యూస్ చేస్తున్న "శారీ" సినిమా పోస్టర్ ని షేర్ చేశాడు.  దీంతో కొందరు నెటిజన్లు ఈ ట్వీట్ పై స్పందిస్తూ మెగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి ఆర్జీవీ ఈ ట్వీట్ చేశాడని కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని డిసెంబర్ 05న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో వరల్డ్ వైడ్ గ దాదాపుగా 12500 స్క్రీన్స్ లో ప్యాన్ ఇండియా భాషలలో రిలీజ్ కాబోతోంది. దీంతో పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక డైరెక్టర్ ఆర్జీవీ విషయానికొస్తే ప్రస్తుతం మళ్ళీ మంచి కథతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చే పనిలో పడ్డాడు. ఈ విషయాన్ని ఆ మధ్య హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో జరిగిన సినిమాటికా ఎక్స్ పో లో తెలిపాడు. అలాగే ఆర్జీవీ డెన్ బ్యానర్ పై పలు సినిమాలు నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్జీవీ నిర్మిస్తున్న "శారీ" సినిమా వచ్చే ఏడాది జనవరి 30న రిలీజ్ కాబోతోంది.