RGV: 35 ఏళ్ల ట్రెండ్ సెట్టర్ ఫిల్మ్ శివ.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్

RGV: 35 ఏళ్ల ట్రెండ్ సెట్టర్ ఫిల్మ్ శివ.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్

నాగార్జున (Nagarjuna) పట్టిన సైకిల్ చైన్ సీన్..ఎందరో సినిమా పిచ్చోళ్లను చేసేందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా సైకిలు చైనుతో శివ తిరగబడటం అందరికీ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఆ ఒక్క సీన్ మాత్రమే కాదు.. ఆర్జీవీ మేకింగ్ స్టైల్.. కాలేజీ కుర్రాడిని డాన్ గా మార్చిన ఆ డిఫెరెంట్ మ్యానరిజమ్ ప్రతిఒక్కరినీ సినిమా వైపు లాగేసింది. అసలు ఇంతకు ఏ విషయం గురించి మాట్లాడుతున్నామో తెలిసే ఉంటుంది. అదే తెలుగు ఇండస్ట్రీ ట్రెండ్ సెట్టర్ ఫిల్మ్ శివ(Shiva). 

కాంట్రవర్శియల్ కామెంట్స్కు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వం వహించిన ఫస్ట్ ఫిల్మ్ శివ. 5 అక్టోబర్ 1989లో క్రైమ్ యాక్షన్ జోనర్ లో తెరకెక్కించిన ఈ మూవీ నాగార్జున కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. అంతేకాదు నాగార్జునకు శివ కల్ట్ స్టేటస్ ఇచ్చింది. కాగా ఈ మూవీ రిలీజై నేటికీ (5 అక్టోబర్ 2024) నాటికి 35 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో డైరెక్టర్ ఆర్జీవీ ట్విట్టర్ X ద్వారా పోస్టర్ రిలీజ్ చేస్తూ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు. 

ALSO READ | TheyCallHimOG: నా ట్వీట్ పిన్ చేసి పెట్టుకోండి.. ఓజీ మూవీపై తమన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్

"ట్రెండ్ సెట్టర్ ఫిల్మ్ శివ ఈ రోజు 2024 అక్టోబరు 5తో.. రిలీజై 35ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో భాగమైన ప్రతిఒక్క టెక్నీషియన్ కి శుభాకాంక్షలు" అని ఆర్జీవీ తెలిపారు. 

శివ సినిమా విశేషాలు ::

ఈ సినిమాకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కథ, స్క్రీన్ ప్లే అందించగా.. తనికెళ్ళ భరణి మాటలు అందించారు. 75 లక్షల బడ్జెట్‌తో నిర్మించబడిన (5 అక్టోబర్ 1989న) శివ విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది. అంతేకాకుండా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ   విజయం అందుకుంది. తెలుగు సినిమాలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. శివ 22 సెంటర్లలో 100 రోజులు ఆడగా..ఐదు సెంటర్లలో 175 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఎన్నేళ్ళైనా భారతదేశ 100 ఉత్తమ చిత్రాలలో శివ కూడా ఒకటిగా నిలిచే ఉంటుంది. 

సైకిలు చైనుతో శివ తిరగబడటం అందరికీ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. తర్వాత చాలా సినిమాలలో దీనిని పేరడీగా ఉపయోగించైనా దీన్ని అంత ఇంపాక్ట్ చూపలేకపోయాయి. అలాగే తన పైకి పంపిన మనిషిని శివ భుజాన వేసుకొని నేరుగా భవానీ ఎదుటకి వెళ్ళే సమయంలో నానాజీ భవానీ చెవిలో చిన్నగా 'శివ అంటే వీడే' అని చెప్పే క్లైమాక్స్ సీన్ అందరిచేత చప్పట్లు కొట్టించింది.

ఇందులో నటించిన హీరో జేడీ చక్రవర్తి 'జెడి' పాత్రతో ఫేమస్ అయ్యాడు. ఎంతలా అంటే.. జెడి చక్రవర్తి అని చెబితే తప్ప ఏ చక్రవర్తో పోల్చుకోలేనంతగా! ఈ సినిమాకు గాను ఆర్జీవీ నంది అవార్డు అందుకోగా..నాగార్జున ఫిలింఫేర్ అవార్డు సొంతం చేసుకున్నాడు.