AnimalAaradhya: యానిమల్ ఆరాధ్య మతిపోయే ఫొటో సిరీస్‌.. వరుస ట్వీట్స్తో రెచ్చిపోయిన ఆర్జీవీ

AnimalAaradhya: యానిమల్ ఆరాధ్య మతిపోయే ఫొటో సిరీస్‌.. వరుస ట్వీట్స్తో రెచ్చిపోయిన ఆర్జీవీ

డైరెక్టర్ ఆర్జీవీ(Ram Gopal Varma) దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతోన్న చిత్రం ‘శారీ’(Saree). సత్య యాదు, ఆరాధ్య దేవి (Aradhya Devi) జంటగా గిరి కృష్ణ కమల్ దర్శకత్వంలో రవి వర్మ నిర్మిస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్స్‌‌‌‌‌‌‌‌ను బేస్ చేసుకుని  సైకలాజికల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

వర్మ పర్యవేక్షణలో తెరకెక్కుతోన్న ‘శారీ’ చిత్రంతో హీరోయిన్‌‌‌‌గా పరిచయమవుతోంది ఆరాధ్య దేవి. తాజాగా ఈ హీరోయిన్‌‌‌‌తో స్టిల్ ఫొటోగ్రాఫర్  నవీన్ కళ్యాణ్ ‘యానిమల్ ఆరాధ్య’ పేరుతో  ఫొటో సిరీస్‌‌‌‌ను రూపొందించాడు.

ఆదివారం (ఫిబ్రవరి 9న) ఈ ఫొటో సిరీస్‌‌‌‌ను లాంచ్ చేసిన వర్మ మాట్లాడుతూ ‘అడవి జంతువులతో ఆరాధ్య ఫోటో షూట్ చేయడం సమ్ థింగ్ స్పెషల్‌‌‌‌గా ఉంది. ఇంత వినూత్న తరహాలో చిత్రీకరించిన నవీన్ కళ్యాణ్‌‌‌‌ను అభినందిస్తున్నా’అని అన్నారు.

అలాగే వర్మ తన సోషల్ మీడియాలో వరుస ఫొటోస్ షేర్ చేస్తూ.. తనదైన క్యాప్షన్స్తో షేక్ చేస్తున్నాడు. కొత్తదనాన్ని ఎంకరేజ్ చేసే ఆర్జీవీ గారికి నవీన్ కళ్యాణ్, ఆరాధ్య దేవి థ్యాంక్స్ చెప్పారు. ఇక ఆరాధ్య నటించిన ‘శారీ’ చిత్రం ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్టు వర్మ ప్రకటించారు.

ALSO READ | Prudhvi Raj: నటుడు పృథ్వీ రాజ్ పొలిటికల్ పంచ్లు.. లైలా సినిమాకు డ్యామేజ్ కానుందా?

గతేడాది తన ఇంస్టాగ్రామ్లో చీర కట్టుకుని రీల్స్ చేసిన అమ్మాయి(శ్రీలక్ష్మీ సతీష్). స్క్రీన్ నేమ్ ఆరాధ్య దేవి(Aaradya Devi)గా అందరికి పరిచయం. ఆరాధ్య వీడియోలను ఆర్జీవి షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ  అమ్మాయి ఎవరో తెలుసా అంటూ నెటిజన్స్ను కూడా ప్రశ్నించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా ఫుల్ వైరల్ అయ్యింది. ఇక ఆ అమ్మాయి ఓవర్ నైట్ ఫేమస్ అయిపొయింది. అలా శారీ'(చీర) గర్ల్గా కుర్రాళ్ళ గుండెల్లో అలా ఉండిపోయింది.