విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ జంటగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన చిత్రం ‘లైలా’. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న సినిమా రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు రామ్ నారాయణ్ మాట్లాడుతూ ‘హీరో లేడీ గెటప్ వేయడం యూనిక్ కాన్సెప్ట్. ఈ మధ్య అలాంటి కథలు రాలేదు. అయితే ఈ కథకు హీరోని వెతకడం చాలెంజింగ్‌గా అనిపించింది. ఈ క్యారెక్టర్ చేయడానికి చాలా గట్స్ కావాలి. లాస్ట్ హోప్‌గా విశ్వక్ ఓకే చేశారు. విశ్వక్ ఒప్పుకోవడం సాహు గారి గ్రేట్ నెస్.
విశ్వక్‌కు కూడా లేడీ గెటప్ చేయాలని కోరిక ఉండటంతో ఈ ప్రాజెక్టు నెక్స్ట్ లెవల్‌కి వెళ్లింది. ఈ పాత్ర కోసం తను చాలా కష్టపడ్డారు. ప్రోస్తటిక్ మేకప్‌కు రెండున్నర గంటలు పట్టేది. ఆయన లుక్ చూసి ఫ్యామిలీనే సర్‌ప్రైజ్ అయ్యారు. సోనూ మోడల్‌గా మేల్ క్యారెక్టర్‌లో, లైలాగా ఫిమేల్ పాత్రలో విశ్వక్ నటించిన తీరు కచ్చితంగా అందరికీ నచ్చుతుంది.
ఓల్డ్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ కథలో మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ ఎంజాయ్ చేసేలా క్లీన్ కామెడీ ఉంటుంది. దాంతోపాటు యాక్షన్, రొమాన్స్, ఎమోషన్ కూడా ఉంటుంది. విశ్వక్ సేన్ నుంచి ఏం ఆశిస్తారో దానికి పదిరెట్లు ఎక్కువ ఈ సినిమాలో ఉంటుంది.
అలాగే విశ్వక్ ఇందులో రెండు పాటలు కూడా రాశారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్‌కి, విశ్వక్‌కి మంచి సింక్ కుదిరింది. అది సినిమాకి ప్లస్ అయ్యింది. హీరోయిన్ ఆకాంక్ష శర్మ జిమ్ ట్రైనర్‌గా నటిస్తే, కామాక్షి స్పెషల్ క్యారెక్టర్‌లో కనిపించనుంది. అభిమన్యు సింగ్ కామెడీని చాలా ఎంజాయ్ చేస్తారు. నిర్మాత సాహు గారపాటి గారి వలనే ఈ సినిమా ముందుకెళ్లింది. ఆయన ఈ ప్రాజెక్టును బాగా నమ్మడం, విశ్వక్‌తో సినిమా చేయడం నాకు పెద్ద ఎచీవ్మెంట్’ అని చెప్పాడు.