ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో నేడు ( November 19) ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే, ఉదయం పది గంటల ప్రాంతంలో తాను విచారణకు రాలేనంటూ ఆర్జీవీ పోలీసులకు మెసేజ్ పంపించారు.. తనపై నమోదైన కేసులో విచారణకు పోలీసులకు సహకరిస్తానని ఆర్జీవీ చెప్పారు. అయితే, తన వ్యక్తిగత పనుల కోసం నాలుగు రోజుల సమయం కావాలని కోరారు. ఆ తర్వాత తప్పకుండా విచారణకు వస్తానని ఆర్జీవీ తన మెసేజ్ లో పేర్కొన్నట్లు అధికార వర్గాల సమాచారం.
ALSO READ : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అనచరులు అరెస్ట్.. కంకిపాడు పీఎస్ కు తరలింపు
వ్యూహం మూవీ రిలీజ్ సమయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా సోషల్ మీడియాలో వారి ఫొటోలను మార్ఫింగ్ చేసిన పోస్టులకు సంబంధించి ఆర్జీవీపై ఒంగోలు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు రమ్మంటూ నోటీసులు కూడా జారీ చేశారు. నవంబర్ 19న ఉదయం 11 గంటలకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆర్జీవీని విచారించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. అయితే, వ్యక్తిగత పనులు ఉండడంతో విచారణకు హాజరుకాలేక పోతున్నానంటూ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆర్జీవీ పోలీసులకు సమాచారం అందించారు.