బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీపై.. వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

స్కిల్ డెవ్ లప్ మెంట్ స్కాం కేసులో  టీడీపీ అధినేత చంద్రబాబు  రాజమండ్రి సెంట్రల్ జైల్లో  ఉన్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో   గత కొన్ని రోజులుగా టీడీపీ, చంద్రబాబు  టార్గెట్ గా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో వరుసగా విమర్శలు చేస్తున్నారు. 

స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును సమర్థిస్తున్న వారు తాను అడిగే 12 ప్రశ్నలకు సమాధానం  చెప్పాలని రెండు రోజుల క్రితమే ట్విట్టర్లో నెటిజన్లను ప్రశ్నించారు వర్మ.  లేటెస్ట్ గా..  తొందరపడి  నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావొద్దంటూ వర్మ చేసిన మరో ట్వీట్ ఇపుడు వైరల్ గా మారుతోంది. 

ALSO READ: కవితను కేసీఆర్ జైలుకు పంపిస్తరు.. ఎన్నికల్లో సింపతి కొట్టేస్తరు : రేవంత్

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా నారా బ్రాహ్మణి ఇటీవల  క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు  చేశారు.  ఎలాంటి ఆధారాలు లేకుండా  చంద్రబాబుపై  కేసు పెట్టారని ఆరోపించారు. మరో వారం రోజుల్లో చంద్రబాబు నిర్దోషిగా జైలు నుంచి విడుదలవుతారని భావించారు.   ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబుపై కేసు పెట్టారని.. తన కొడుకు దేవాన్స్  సీఐడీ రిమాండ్ రిపోర్టు   చదివినా   అర్థం అవుతుందని సెటైర్లు వేశారు. ఈ  వీడియోను  ట్విట్టర్లో పోస్ట్ చేసిన వర్మ.. నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీపై వ్యాఖ్యలు చేశారు.  

స్కిల్ స్కాం కేసులో నారా బ్రాహ్మణికి ఎవరో తప్పుడు సమాచారం ఇస్తున్నారని వర్మ అన్నారు.  అయితే ఇప్పుడున్న సందర్బంలో బ్రాహ్మణి తొందరపడి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి..  గ్రాండ్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని  చేజార్చుకోవద్దని  వర్మ విజ్ఞప్తి చేశారు.  దీనికి సంబంధించి మరిన్ని విషయాలు త్వరలో చెబుతానని ట్వీట్ చేశారు.