![ఎట్టకేలకు ఒంగోలు పీఎస్కు రాంగోపాల్ వర్మ.. 50 ప్రశ్నలతో పోలీసులు](https://static.v6velugu.com/uploads/2025/02/director-ramgopal-varma-attends-police-enquiry-in-ongole-ps_NzYGEHZXCv.jpg)
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎట్టకేలకు పోలీసుల విచారణకు హాజరయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పీఎస్ కు శుక్రవారం (ఫిబ్రవరీ 7) ఆర్జీవీ హాజరయ్యారు. వర్మను విచారించేందుకు పోలీసులు సుమారు 50 ప్రశ్నలు సిద్ధం చేశారు.
చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ల ఫోటోలను మార్ఫ్ చేసిన వీడియోను ట్వీట్ చేశారని రాంగోపాల్ వర్మపై కేసు నమోదైంది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్ లో 2024లో ఆర్జీవీపై కేసు నమోదవ్వగా.. ఇప్పటి వరకు ఆయన హాజరు కాలేదు.
Also Read :- ఫైనల్లీ నీ ముఖం దర్శనం అవుతుంది సామీ
షూటింగ్ షెడ్యూల్ కారణంగా రాలేక పోతున్నానని, వీలైనపుడు వస్తానని విచారణకు దూరంగా ఉన్నారు వర్మ. పోలీసులు అరెస్టు చేస్తారనే వార్తలు వచ్చిన క్రమంలో కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే తను అజ్ఞాతంలో లేనని, విచారణకు హాజరవుతానని ఇటీవలే ప్రకటించారు.
ప్రస్తుతం వర్మ విచారణకు హాజరు కాని పక్షంలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉండటంతో.. శుక్రవారం విచారణకు హాజరయ్యారు.