రాజావారు రాణిగారు’ సినిమా ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు రవి కిరణ్ కోలా. ఇయన తాజాగా మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో పోలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా తీయబోతున్నాడు. అయితే ఈ రోజు తన బర్త్ డే ను పురస్కరించుకొని తను చేయబోయే ఫ్యూచర్ ఫిల్మ్స్ గురించిన పలు విషయాలు పంచుకున్నాడు.
ఆ షార్ట్ ఫిల్మ్ నాకు మంచి లెర్నింగ్ అయ్యింది..
"మాది ఈస్ట్ గోదావరి ఏలేశ్వరం మండలంలోని భద్రవరం అనే చిన్న విలేజ్. చిన్నప్పటి నుండి నాకు సినిమాపై వున్న ప్యాషన్ తో చిత్ర దర్శకుడు అవ్వాలనే కోరికతో 2016 లో హైదరాబాద్ రావడం జరిగింది. సినీ ఇండస్ట్రీలో నాకు ఎక్కువగా పరిచయాలు లేనందున నేను రాసుకున్న కథను చెప్పడానికి ప్రయత్నం చేసే వాన్ని. ఈ క్రమంలో ఒక వ్యక్తి మూడు నెలల్లో సినిమా స్టార్ట్ అవుతుంది మంచి స్క్రీన్ ప్లే రాసి ఇవ్వమన్నాడు. రాసిచ్చినా అది స్టార్ట్ కాలేదు. ఆ తరువాత స్వచ్ఛ భారత్ పై యాంకర్ రవితో "దిల్ సే" షార్ట్ ఫిల్మ్ తీశాను. దీనికి మంచి అప్లాజ్ వచ్చింది. ఆ షార్ట్ ఫిల్మ్ నాకు మంచి లెర్నింగ్ అయ్యింది. ఆ తరువాత మ్యూజిక్ డైరెక్టర్ జై ద్వారా కిరణ్ అబ్బవరం పరిచయమవ్వడం జరిగింది. మొదట వెబ్ సిరీస్ చేద్దాం అనుకోని తక్కువ బడ్జెట్ లో15 మంది టీంతో ఈస్ట్ గోదావరి కెళ్ళి షూట్ చేశాము. అయితే కథ బాగుంది ఫీచర్ ఫిల్మ్ లా ఉందని టీం అంతా ప్రోత్సహించారు. నాకు, కిరణ్ కు మా ఇద్దరికీ ఇది మొదటి సినిమా అవ్వడంతో ఎంతో కేర్ తీసుకొని తీసిన సినిమానే "రాజావారు రాణిగారు". సురేష్ ప్రొడక్షన్ లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంశలు అందుకోవడమే కాకుండా మంచి విజయం సాధించింది.
పోలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న కథ..
ఆ తరువాత నేను చేసే రెండవ సినిమా డిఫరెంట్ జోనర్ లో చేయాలని, ప్రేక్షకులకు పెద్ద యాక్షన్ ప్యాక్డ్ సినిమా అందించాలనే ఉద్దేశ్యంతో పోలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న కథను మ్యాట్నీ ఏంటర్ టైన్మెంట్స్ వారికి వినిపించాను. ఈ సినిమా వర్క్ తో బిజీగా ఉన్న నేను మన దగ్గర ఉన్న కథలను ఆపగూడదు అన్న ఉద్దేశ్యంతో నా "రాజావారు రాణిగారు" సినిమాకు డి.ఓ.పిగా చేసిన విద్యా సాగర్ ను నా దగ్గర ఉన్న తెలంగాణ అబ్బాయి ఆంధ్ర అమ్మాయి కథ అయిన "అశోకవనంలో అర్జున కళ్యాణం’ ద్వారా డైరెక్టర్ గా పరిచయం చేయడం జరిగింది. ఈ సినిమాకు కథ- మాటలు, స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. అయితే నిర్మాతలు మాత్రం నువ్వు అనుకున్న కథ ప్రాపర్ గా రావాలంటే నువ్వు ఈ సినిమాకు షో రన్నర్ గా ఉండమని చెప్పడంతో షో రన్నర్ గా కూడా వ్యవహరించడం జరిగింది.
షో రన్నర్ అంటే దర్శకత్వ పర్యవేక్షణ లాంటిది..
సాధారణంగా నేషనల్, ఇంటర్ నేషనల్ వెబ్ సిరీస్ కు మాత్రమే షో రన్నర్స్ ఉంటారు. షో రన్నర్ అనేది మన సినిమాలకు కొత్త, ఫస్ట్ టైం షో రన్నింగ్ కాన్సెప్ట్ ను యస్.వి.సి.సి డిజిటల్ వారు తీసుకొద్దాం అనుకోని 'అశోకవనంలో...' సినిమాకు షో రన్నర్ గా ఉండమన్నారు. షో రన్నర్ అంటే దర్శకత్వ పర్యవేక్షణ లాంటిది. సినిమాకి సంబంధించిన పూర్తి క్రియేటివిటీ రెస్పాన్స్ బులిటీని తీసుకోవడంమే దీని ఉద్దేశం. నా దగ్గర ఉన్న కథలతో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని నా దగ్గర వర్క్ చేసిన వారికి అవకాశం ఇస్తూ ఆ సినిమాలకు నేను షో రన్నర్ గా ఉంటాను. ప్రస్తుతం నేను మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ లో సినిమా వర్క్ జరుగుతోంది. దీంతోపాటు ఎస్‌వీసీసీ బ్యానర్ లో ఇంకో సినిమా ఉంటుంది. అలాగే ఓ అడ్వెంచర్స్ డ్రామా కథ కూడా రెడీగా ఉంది. ఇవి కాకుండా మరి కొన్ని కథలు ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను అని" ముగించారు.