టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. ఆయన అరెస్టుపై రాజకీయ నాయకులతో పాటు.. సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఆ లిస్టులో టాలీవుడ్ దర్శకుడు రవిబాబు(Ravibabu) కూడా చేరిపోయారు. ఇంస్టాగ్రామ్ వేదికగా వీడియోను షేర్ చేశారు.
ఏ వీడియోలో రవిబాబు మాట్లాడుతూ.. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. సినిమా వాళ్ల గ్లామర్, రాజకీయ నాయకుల పవర్ ఎప్పటికీ శాశ్వతం కాదు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన కష్టాలు కూడా శాశ్వతం కాదు. రామారావుగారి ఫ్యామిలీ, చంద్రబాబు గారి ఫ్యామిలీ.. మా ఫ్యామిలీకి దగ్గరి ఆప్తులు. చంద్రబాబు గారి గురించి చెప్పాలంటే.. ఆయన ఏదైనా పని చేసే ముందు వంద యాంగిల్స్ లో ఆలోచిస్తారు. దానిపై అందరినీ సంప్రదించి.. ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా డెసిషన్ తీసుకుంటారు. ఆయనకు భూమి మీద ఇవాలే లాస్ట్ రోజు అని తెలిస్తే.. నెక్స్ట్ 50 సంవత్సరాలకు సంబందించిన సోషల్ డెవలప్మెంట్ గురించి ప్లాన్ చేస్తారు. అలాంటి వ్యక్తిని ఆధారాలు కూడా లేకుండా జైల్లో పెట్టి ఎందుకు వేదిస్తున్నారో నాకు అర్థం కావడంలేదు.
రాజకీయాల్లో ఎత్తులు, పైఎత్తులు వేయడం సహజం. కానీ ఒక 73 ఏళ్ల వయసున్న వ్యక్తిని జైల్లో పెట్టి హింసించడం.. ఎత్తో పైఎత్తో అయితే మాత్రం అది చాలా దారుణం. అశాశ్వతమైన పవర్ ఉన్న వారికి నా హంబుల్ రిక్వెస్ట్.. మీరు ఏ పవర్ ను వాడి ఆయనను జైల్లో పెట్టారో.. దయచేసి అదే పవర్ ను వాడి బయటకు తీసుకురండి. మీరు చిటికేస్తే జరిగిపోతుందని అందరికీ తెలుసు. ఆయనను బయట ఉంచి మీ ఇష్టం వచ్చినట్లు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. ఆయన దేశందాటి పారిపోయే మనిషైతే కాదు. ఆలోచించండి. చరిత్ర మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలని అనుకుంటున్నారు. కక్షతో రగిలిపోయే కసాయి వాళ్లలాగానా.. లేక ప్రేమ, జాలితో ఉండే మంచి నాయకుడిగానా.. అని చెప్పుకొచ్చారు రవిబాబు. ప్రస్తుతం రవిబాబు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.