ముద్దు పెడితే తప్పేంటీ.. సమర్థించుకున్న డైరెక్టర్

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun) హీరోగా ఎ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తిరగబడర సామి(Tiragabadara Saami). రీసెంట్గా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ ఎ.ఎస్ రవికుమార్(A S Ravi Kumar)..హీరోయిన్ మన్నారచోప్రా( Mannara Chopra) భుజంపై చెయ్యేసి ముద్దు పెట్టుకున్నారు.

దీంతో సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యింది. ఇండస్ట్రీ నుంచి భిన్నమైన కామెంట్స్ రావడంతో..లేటెస్ట్గా డైరెక్టర్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో ముద్దు ఇస్యూపై రియాక్ట్ అయ్యారు..నా సినిమాలో ఉన్న హీరోయిన్కు ముద్దు పెడితే తప్పేంటీ? తన యాక్టింగ్కు మెచ్చి..తన వర్క్, డెడికేషన్కు ఫిదా అయ్యి ముద్దు పెట్టాను అంతే తప్పా. ఏం లేదు.ఎంతో ఆప్యాతతోనే అలా చేశ..నా కూతురిని కూడా అలాగే ముద్దు పెట్టుకుంటా. అయినా నా ఫ్యామిలీకి లేని ఇబ్బంది..మిగతా వారికీ ఎందుకు? అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు డైరెక్టర్.  

ALSO READ :ఇల్లు అలకగానే పండగ కాదు.. ఎన్నికలకు ఇంకా 3 నెలలు ఉంది

ఎ.ఎస్ రవికుమార్ చౌదరి.. హీరో బాలకృష్ణ తో వీరభద్ర మూవీని డైరెక్ట్ చేశారు. ఇప్పుడు రాజ్ తరుణ్తో తిరగబడర సామి మూవీలో హీరోయిన్ను బాలకృష్ణ ఫ్యాన్గా చూపించారు. ఎ.ఎస్ రవికుమార్ యజ్ఞం, పిల్లా నువ్వులేని జీవితం, సౌఖ్యం వంటి మూవీస్ ను డైరెక్ట్  తెరకెక్కించారు. ఇక మన్నారచోప్రా రోగ్, జక్కన్న, తిక్కా మూవీస్ తో  తెలుగు ఆడియన్స్కు ఫేమస్ అయింది. కానీ మన్నారచోప్రాకి సరైన హిట్ దక్కలే. దీంతో  హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో..తిరగబడర సామి మూవీలో మెయిన్ విలన్కి కో స్టార్ గా యాక్ట్ చేసింది. 

జెబి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి భాష్యశ్రీ డైలాగ్ రాస్తున్నారు. మకరంద్ దేశ్‌‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్పై మల్కాపురం శివకుమార్  తిరగబడర సామి మూవీని నిర్మిస్తున్నారు.మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్స్‌‌ గా నటిస్తున్నారు.