సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) వ్యూహం (Vyooham) మూవీ మరోసారి పోస్ట్ఫోన్ అయింది. లేటెస్ట్గా ఆర్జీవీ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించాడు. 'పట్టు వదలని విక్రమార్కుడని అంటూ..సెన్సార్ కాఫీని చూపిస్తూ..మార్చి 2న వ్యూహం రిలీజ్ కాబోతుందని ప్రకటించారు.
ఇటీవలే సెన్సార్ సర్టిఫికెట్ అందుకున్న క్రమంలో వ్యూహం మూవీ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇపుడు లేటెస్ట్ పోస్ట్లో..ఒకరోజు ఆలస్యంగా మార్చి 2 న రిలీజ్ చేస్తున్నట్టు..గన్ పట్టుకుని తనదైన స్టైల్లో స్టిల్ ఇస్తూ అఫీషియల్గా డేట్ అనౌన్స్ చేశారు వర్మ.
అయితే, ఈ సినిమా తరుచూ పోస్ట్ఫోన్ అవ్వడం..ఇదిగో కొత్త డేట్ అంటూ ఊరిస్తూ వస్తున్నారు వర్మ. ఇక సినిమాని చూసేయొచ్చని ఆర్జీవీ ఫ్యాన్స్ కూడా భలే ఖుషి అవుతూ వస్తున్నారు.దీంతో పదే పదే వాయిదాలతో ఊరించకండి ఆర్జీవీ సార్..అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
అరచేతిని అడ్డుపెట్టి వ్యూహం సినిమాను ఆపలేరు అని చెప్పిన మీరే..వరసగా పోస్ట్ఫోన్ చేయడం ఏంటీ? అంటూ ఫ్యాన్స్ ఆగలేకపోతున్నారు. మరి ఈ సారైనా ఆర్జీవీ వ్యూహం మారదని నమ్ముదాం.
పట్టు వదలని విక్రమార్కున్ని .. VYOOHAM in theatres MARCH 2nd 💪 pic.twitter.com/DoGK95a4PB
— Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024