
‘మత్తు వదలరా’ చిత్రంతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న రితేష్ రాణా.. ఇప్పుడు లావణ్య త్రిపాఠి లీడ్ రోల్‌లో ‘హ్యాపీ బర్త్‌డే’ మూవీని తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా జులై 8న రిలీజవుతున్న సందర్భంగా రితేష్ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం మన సమాజంలో గన్స్ లీగల్ కాదు. అందరి దగ్గర గన్స్ ఉండటం కూడా కష్టం. అందుకే ఒక ఫేక్ వరల్డ్ క్రియేట్ చేద్దామనే ఆలోచన వచ్చింది. అదే ఈ కాన్సెప్ట్. సర్రియల్ కామెడీ జానర్‌లో ఉంటుంది. ఇది తెలుగులో ఇప్పటి వరకు రాలేదు. ఇదే మొదటిసారి. కచ్చితంగా కొత్తగా ఉంటుంది.
అయితే ప్రేక్షకులకు ఎలాంటి డౌట్స్ రాకుండా ఈ జానర్ గురించి ప్రమోషన్స్‌లోనే చెబుతున్నాం. కథ మొత్తం లాజికల్‌గా ఉంటుంది. కానీ జరిగేదంతా ఊహాజనితంగా ఉంటుంది. లీడ్ రోల్ చేసిన లావణ్య మినహా మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ అంతా నా ఫస్ట్ మూవీ టీమే. మా అందరి మధ్య మంచి సింక్ కుదిరింది. అందుకే అలా కంటిన్యూ అవుతున్నాం. లావణ్య ఇలాంటి సినిమా ఎప్పుడూ చేయలేదు. ఆమె బయట చాలా జోవియల్‌గా ఉంటారు. ఒక టీవీ షోలో తనని చూసి ఈ క్యారెక్టర్ రాశాను. ఇందులో తన పేరు హ్యాపీ. ఆమె బర్త్‌డే రోజు కథలో కీలక అంశాలు జరుగుతాయి కాబట్టి ఈ టైటిల్ పెట్టాం. కాలభైరవ క్రేజీ మ్యూజిక్ ఇచ్చాడు. మైత్రి మూవీ మేకర్స్‌తో వర్క్ చేయడం చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. నా స్టైల్ వాళ్లకి తెలుసు. ఈ బ్యానర్‌లోనే మరో రెండు సినిమాలు చేస్తున్నా. కథలు లాక్ అయ్యాయి. మిగతా విషయాలు త్వరలోనే అనౌన్స్ చేస్తాం’ అని చెప్పారు.