
కమర్షియల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సంపత్ నంది.. తన సూపర్ విజన్‌లో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్‌తో రూపొందించిన చిత్రం ‘ఓదెల2’. నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’కు ఇది సీక్వెల్. తమన్నా లీడ్‌గా అశోక్ తేజ దర్శకత్వంలో డి మధు నిర్మించారు. ఏప్రిల్ 17న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా గురించి సంపత్ నంది చెప్పిన విశేషాలు.
‘‘ఓదెల చిత్రంలో అంతం చేసిన దుష్టుడు ఆత్మగా మారితే.. ఆ దుష్ట శక్తిని అంతం చేయడానికి శివశక్తి లాంటి క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది.
తమన్నా గారితో ఆల్రెడీ వర్క్ చేశాను కనుక ఈ క్యారెక్టర్‌కి తను యాప్ట్ అని భావించి కథ చెప్పా. శివ శక్తి పాత్రలో ఆమె అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. మేకప్ లేకుండా, సినిమా పూర్తయ్యే వరకు చెప్పులు కూడా లేకుండా నటించారు. కంప్లీట్ శాకాహారిగా మారిపోయారు. ఇక హెబ్బా పటేల్ క్యారెక్టర్ చాలా కీలకం. వశిష్ట సింహ పాత్ర హైలైట్‌గా ఉంటుంది. ట్రైలర్‌లో ‘అరుంధతి’ పోలికలు కనిపించినా ఈ రెండూ దేనికవే ప్రత్యేకమైన సినిమాలు.
ఇందులో ఆత్మకు పరమాత్మకు మధ్య జరిగే యుద్ధం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. డైరెక్టర్ అశోక్ ‘ఓదెల’ తరహాలోనే దీన్ని కూడా బాగా రూపొందించాడు. అజినీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ . బ్యాక్‌గ్రౌండ్ స్కోరు అద్భుతంగా ఉంటుంది. గ్రాఫిక్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. దాదాపు 150 మంది వీఎఫ్ఎక్స్ నిపుణులు ఆరు నెలలుగా వర్క్ చేశారు. విజువల్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఆడియెన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తాయి. ప్రొడ్యూసర్ మధు ఒక సంకల్పంతో ఈ సినిమా చేశారు. థర్డ్ పార్ట్ గురించి ఎలాంటి ప్లానింగ్ చేయలేదు. అవన్నీ దేవుడే ప్లాన్ చేస్తాడని నమ్ముతా. శర్వానంద్ హీరోగా 1960 బ్యాక్‌డ్రాప్‌లో ఓ మూవీ రూపొందిస్తున్నా’’.