Prabhas Spirit: యానిమల్ సక్సెస్తో..స్పిరిట్ అప్డేట్ ఇచ్చేసిన సందీప్ వంగా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం సలార్ మూవీతో బాక్సాపీస్ లెక్కలు తిరగరాసే పనిలో ఉన్నారు. ఇక తన నుంచి రాబోయే సినిమాలు చూసుకుంటే..టాలెంటెడ్ డైరెక్టర్ కల్కి మూవీతో పాటు మారుతి డైరెక్షన్ లో ఒకటి, యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ (Spirit) చేస్తున్నారు. లేటెస్ట్గా స్పిరిట్ మూవీ నుంచి చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి.

రీసెంట్గా యానిమల్ ఇచ్చిన సక్సెస్తో వరుస ఇంటర్వ్యూలో బిజీగా ఉన్న డైరెక్టర్ సందీప్..స్పిరిట్లో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడో రివీల్ చేశాడు. ఇప్పటికే స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాలో గతంలో ఎప్పుడూ చూడని ప్రభాస్ ను చూడబోతున్నట్లు తెలిపి ఫ్యాన్స్ లో జోష్ పెంచాడు. అలాగే ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీసు క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు తెలిపారు.  అలాగే యానిమల్‌కు సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ ఉంటుందన్నారు.

స్పిరిట్ సినిమా ఎలా ఉండబోతుందో అనేది చాలా విధాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీ అర్జున్ రెడ్డిలో చూపించిన డ్రగ్స్ కంటే 90% పవర్ ఫుల్ డ్రగ్స్ మాఫియా ఉండనుందని సమాచారం. అలాగే స్పిరిట్లో చాలా స్పెషల్ డ్రగ్స్..అంటే, భీకరమైన మత్తెక్కించే క్వాలిటీ డ్రగ్ తీసుకుంటే ఏ రేంజ్లో ఉంటుందో..ఇందులో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ ఇచ్చిన హింట్ ఏమో..పోలీసు క్యారెక్టర్ లో ప్రభాస్ నటిస్తుండు అని..మరి డ్రగ్స్ మాఫియాను రూల్ చేసేది ఎవరు? దాన్ని అంతం చేయడానికి హీరో ప్రభాస్ ఎలా పోరాడాడు అనేది చూడబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

స్పిరిట్ మూవీని టీ-సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. యానిమల్ మూవీతో పాన్ ఇండియా లెవల్లో పేరు సంపాదించిన సందీప్ రెడ్డి వంగా.. స్పిరిట్తో మరో లెవల్కు వెళ్లడం మాత్రం కన్ఫమ్ అంటూ సినీ క్రిటిక్స్ చెబుతున్నారు.