Spirit: సందీప్ రెడ్డి వంగా చెప్పిన ఒక్కమాటతో.. ట్రెండింగ్‌లోకి వచ్చేసిన ‘స్పిరిట్‌’

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె నిర్మించిన చిత్రం ‘పొట్టేల్’. అక్టోబర్ 25న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) మాట్లాడుతూ స్పిరిట్ అప్డేట్ ఇచ్చారు.

చాలా రోజుల నుంచి ప్రభాస్(Prabhas) స్పిరిట్ (Spirit) మూవీ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగా అక్టోబర్ 22న చెప్పిన ఒక్కమాటతో ట్విట్టర్ ట్రేండింగ్లో స్పిరిట్ నిలిచింది. యాంకర్‌ సుమ ‘స్పిరిట్‌’ సినిమా అప్‌డేట్‌ ఇవ్వాలని పొట్టేల్ వేదికగా కోరింది. దీంతో సందీప్‌ పలకపై ‘పోలీస్‌ స్టోరీ’ అని రాసి చూపించాడు.

ఇక ఇన్నాళ్లు స్పిరిట్‌ స్టోరీ ఇదేనంటూ నెటిజన్స్ గత కొన్నాళ్లుగా రకరకాల కథలు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తూ వచ్చారు. స్పిరిట్‌ మూవీలో ప్రభాస్‌ పోలీసుగా కనిపించబోతున్నాడని కూడా ప్రచారం జరుగుతూనే ఉంది. తాజాగా ఈ విషయాన్ని సందీప్‌ చెప్పడంతో డార్లింగ్ ఫ్యాన్స్‌ ఆనందానికి హద్దులేకుండా పోయింది. 

Also Read :- హౌస్ నుంచి వెళ్లిపోతానన్నమాజీ కంటెస్టెంట్

నిజానికి సందీప్ రెడ్డి వంగా సినిమాలో హీరోలు యాటిట్యూడ్ అండ్ షార్ట్ టెంపర్ గా ఉంటారు. అదే మెయిన్ హైలెట్ అవుతుంది.ఇప్పుడు ప్రభాస్ కోసం కూడా అదే రేంజ్ క్యారెక్టర్ డిజైన్ చేసి ఉంటాడని ఫ్యాన్స్ ఆశగా ఉన్నాడు.ప్రభాస్ కటౌట్ కి యాటిట్యూడ్ మిక్స్ అయితే ఆ అవుట్ ఫుట్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడం చాలా కష్టం.అలాంటి హీరో పాత్రను ఢీ కొట్టాలంటే..ఎలాంటి కటౌట్ ఉంటే బాగుంటుందనే విషయంపై సందీప్ ఇంటర్నేషనల్ వైడ్ యాక్టర్స్ ను సెలెక్ట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. 

అంతేకాదు ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగా కు ఉన్న క్రేజ్ కి వెయ్యి కోట్ల టార్గెట్ అంటే తక్కువే. అనుకున్న రేంజ్ లో గనుక స్పిరిట్ వచ్చిందంటే ఇండియా లెవల్లో ఏ స్టార్ కూడా కొట్టని రికార్డ్స్ కొట్టడం ఖాయం.మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.మరి నేడు అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్డే స్పెషల్గా ఏదైనా అప్డేట్ వస్తుందా..లేదా ఇప్పుడు వంగా చెప్పిన మాట ఒకటే అప్డేట్ కానుందా అనేది తెలియాల్సి ఉంది.