Nani,Sekhar Kammula: క్రేజీ కాంబినేషన్..శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో నాని, సాయి పల్లవి?

Nani,Sekhar Kammula: క్రేజీ కాంబినేషన్..శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో నాని, సాయి పల్లవి?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సిటీవ్ చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల(Shekar Kammula). మొదటి సినిమా ఆనంద్ నుండి మొన్నొచ్చిన లవ్ స్టోరీ (Love Story) వరకు ఆయన చిత్రాలన్నీ అలానే ఉంటాయి.

కేవలం భావోద్వేగాలపై కథను నడిపించడం కమ్ముల స్పెషాలిటీ. అలా వచ్చినవే.. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు. ఆయన సినిమాల్లో హీరోయిజం ఉండదు కథే ఆయన బలం. అందుకే ఆయన సినిమాలకు సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 

ప్రస్తుతం శేఖర్ కమ్ముల తన కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కుబేర పేరుతో వస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తున్నారు. అంతేకాదు స్టార్స్ తో ఆయన చేస్తున్న మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. 

Also Read:-మత్తు వదలరా 2 ట్విట్టర్ X రివ్యూ

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఓ క్రేజీ న్యూస్ శేఖర్ కమ్ముల కాంపౌండ్ నుంచి గట్టిగా వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..సాధారణంగా ఓ సినిమా చేస్తున్నప్పుడు శేఖర్‌కమ్ముల మరో సినిమాపై దృష్టి పెట్టరు. అయితే.. శేఖర్‌ తన పంథా మార్చారని, ఏకకాలంలో రెండుమూడు కథల్ని సిద్ధం చేస్తున్నారని, ఈ క్రమంలోనే ఆయన నాని (Nani) కోసం కథ రెడీ చేసినట్టు సమాచారం.

నేచురల్ స్టార్ నానితో పనిచేయాలనే ఆసక్తి శేఖర్ కమ్ములకు ఎప్పటినుంచో ఉంది. అదే విధంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించడానికి నాని కూడా ఉత్సాహంగా ఉన్నాడనే గతంలోనే పలు వార్తలు చూశాం. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ కూడా  కమ్ముల రెడీ చేసినట్లు టాక్. నానికి జోడిగా హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) ని తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. 

శేఖర్‌ కమ్ములతో ఇప్పటికే సహజ నటి సాయిపల్లవి రెండు సినిమాలు చేసింది. అలాగే నానితో MCA, శ్యాంసింగరాయ్‌ సినిమాలు చేసింది. ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయితే.. నాని, శేఖర్‌కమ్ములతో సాయిపల్లవి పనిచేసే మూడో సినిమా ఇదే అవుతుంది. 

ప్రస్తుతం హీరో నాని హిట్ 3 కోసం రెడీ అవుతుండగా..అలాగే సుజిత్ డైరెక్షన్‌లో ఒక సినిమా, దసరా డైరెక్టర్ తో మరో సినిమాను నాని లైన్ లో పెట్టాడు. అంటే..ఈ అరుదైన కాంబో సెట్ అవ్వడానికి..ఓ రెండేళ్లు పడుతుందేమో అని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా సహజ నటులు, అతి సహజమైన డైరెక్టర్ కాంబో అంటే ఇష్టపడని వారెవరు ఉంటారు చెప్పండి. ఆశిద్దాం ఓ మంచి కాంబో కోసం!