SekharKammula: ‘పోయిరా మామ’ సాంగ్.. శేఖర్ కమ్ముల మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్

SekharKammula: ‘పోయిరా మామ’ సాంగ్.. శేఖర్ కమ్ముల మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్

ధనుష్, నాగార్జున లీడ్‌‌ రోల్స్‌‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’.శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా నుంచి (ఏప్రిల్ 20న) రిలీజైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్లో అదరగొడుతుంది. 'పోయిరా మామ' అంటూ సాగే ఈ పాటని మాస్ బీట్‍తో దేవిశ్రీ స్వరపరిచాడు. ధనుష్ ఎనర్జిటిక్‍గా పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. తన ఫ్రెండ్‍కు తుది వీడ్కోలు పలుకుతున్నట్టుగా ఈ పాట సాగుతుంది.

అయితే, ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల డ్యాన్స్ చేశాడు. గ‌తంలో ఎప్పుడు కూడా శేఖ‌ర్ క‌మ్ముల డ్యాన్స్ వేసిన సంద‌ర్భాలు లేవు. ఒక్కసారిగా తనలో పూనకం వచ్చినట్టు స్టెప్పులు వేయడంతో ఆడియన్స్ షాక్ అవుతున్నారు.  దాంతో ఇపుడీ ఫీల్ గుడ్ డైరెక్టర్ వేసిన మాస్ స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

చావుని కూడా సెలబ్రేషన్ లాగా సాగుతున్న ఈ పాట శ్రోతలను వీపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా లోతైన అర్ధాలతో కూడిన ‘పోయిరా మామ’లిరిక్స్ ఆలోచింపజేస్తున్నాయి. ఐదు భాషల్లో రిలీజ్ చేసిన ఈ పాటను తెలుగు, తమిళ భాషల్లో ధనుష్ పాడడం విశేషం. ఈ మూవీ పాన్ ఇండియా భాషల్లో జూన్ 20న థియేటర్లలో రిలీజ్ కానుంది. 

►ALSO READ | సంపూ కొత్త సినిమా ‘సోదరా’.. అమాయకుడైన అన్న, అప్‌‌డేట్ అయిన తమ్ముడు

‘పోయిరా మామ’ సాంగ్ ఫుల్ లిరిక్స్ చూసేయండి:
 
హే వన్‍డే హీరో నువ్వే ఫ్రెండు

నీకోసమే ఈ డప్పుల్ సౌండు..

అసల్ తగ్గక్ అట్లనే ఉండు

మొక్కుతారు కాళ్లూ రెండూ..

నిన్నే చూస్తున్నాది

ఊరు మొత్తం దేవుడిలాగా..

వన్‍వేలో నా నువ్వెళ్లినా

అపరు నిన్ను అందరిలాగా..


రథం మీదే నువ్వే అలాగా

దూసుకెళ్తా ఉంటే అబ్బో యమాగా..

సీఎం, పీఎం ఎదురే వచ్చినా

నువ్వు సలాం కొట్టే పనే లేదుగా..


ముందరి లాగా అంత ఈజీగా

నిన్నే కలుసుకోలేరుగా..

నీతో ఫొటో దిగాలన్నా

చచ్చేంత పనవుతుంది గా..


పోయిరా పోయిరా పోయిరా

పోయిరా మామ

అరే రాజాలాగా దర్జాగా పోయిరా మామ..


పోయిరా పోయిరా పోయిరా

పోయిరా మామా

అరే రాజాలాగా దర్జాగా పోయిరా మావా..


చూస్తూ.. చూస్తూనే.. మారిందే

నీ రేంజ్ ఈరోజున..

నిన్నే అందుకోవాలి అనుకుంటే

సరిపోదే ఏ నిచ్చెన..

సొమ్ములైన సోకులైన

తలొంచవా నీ ముందర..

నిన్నే కొనే ఐసా పైసా

ఈ లోకంలో యాడుందిరా..

నిన్నే తిట్టి గల్లా పట్టి

సతాయించే సారే లేడురా.. ఓ


పోయిరా పోయిరా పోయిరా

పోయిరా మామ

అహా రాజాలాగా దర్జాగా పోయిరా మామ..


నీతోటి మాటాడి గెలిచేటి

దమ్మే ఈడ లేదెవడికి..

స్వర్గం అరే నీ జేబులో ఉంది

బాధే లేదు ఏనాటికీ..

ఎయిరోప్లేను.. రాకెట్టు

నీ కాళ్ల కింద ఎగరాల్సిందే..

ఎంతోడైనా తలే ఎత్తి.. అలా నిన్ను చూడాల్సిందే..

తలరాతల్ని చెరిపి మళ్లా

రాసేసుకో నీకే నచ్చిందే.. ఓ..ఓ


పోయిరా పోయిరా పోయిరా

పోయిరా మామ

మహారాజాలాగా దర్జాగా పోయిరా మామ..


పోయిరా పోయిరా పోయిరా

పోయిరా మామ

అరే రాజా లాగా.. దర్జాగా పోయిరా మామ