‘7/జి బృందావన కాలనీ’ చిత్రం విడుదలై ఇరవై ఏళ్లు దాటుతున్నా.. ఇప్పటికీ ఆ సినిమా ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోయింది. దీనికి సీక్వెల్‌గా ఇప్పుడు ‘7/జి బృందావన కాలనీ 2’ తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
న్యూ ఇయర్ సందర్భంగా ఆ వివరాలను తెలియజేశారు. సీక్వెల్‌లోనూ రవి కృష్ణ హీరోగా నటిస్తుండగా, మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్నారు. అనశ్వర రాజన్ హీరోయిన్. జయరామ్, సుమన్ శెట్టి, సుధ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు.బాలనటిగా కెరీర్ ఆరంభించిన అనశ్వర రాజన్ తొలిసారి థన్నీర్ మథాన్ డినంగల్ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
సీక్వెల్‌కు కూడా యువన్ శంకర్ రాజానే సంగీతం అందిస్తున్నారు. నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సరికొత్త కథ, కథనాలతో.. అప్పటి మ్యాజిక్‌ను రిపీట్ చేసేలా దీన్ని తెరకెక్కిస్తున్నామని నిర్మాత ఎ.ఎం.రత్నం తెలియజేశారు.
Here it is
— selvaraghavan (@selvaraghavan) January 1, 2025
7/G Rainbow colony 2 first look @thisisysr@AMRathnamOfl @ramji_ragebe1 pic.twitter.com/HB3CflZtsb