టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ హీరోగ నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. శనివారం ఏపీలోని రాజమండ్రిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు శంకర్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తన 30 ఏళ్ళ కెరీర్ లో 14 సినిమాలు చేశానని ఇందులో ఒక్కటికూడా తెలుగు సినిమా లేదని కానీ తన అన్ని సినిమాలుతెలుగులో డబ్ అయ్యి రిలీజ్ కాగా టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఆదరించారని అందుకు కృతజ్ఞతులు తెలిపాడు. అలాగే తెలుగువారిపై గౌరవంతో కచ్చితంగా తెలుగులో స్ట్రైట్ సినిమా తీయాలని నిర్ణయించుకుని గేమ్ ఛేంజర్ సినిమా తీశానని చెప్పుకొచ్చాడు. అలాగే హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజుకి థాంక్స్ తెలిపాడు.
Also Read : రిలీజ్ కి ముందే పుష్ప 2 ఆ రికార్డుని బ్రేక్ చేసిన గేమ్ ఛేంజర్
ఇక ఈ సినిమాని నేటివ్ లొకేషన్స్ లో ఎక్కువగా తీశామని నటీనటులు కూడా ఎక్కువమంది తెలుగువాళ్లే ఉన్నారని తెలిపాడు. ఇక గేమ్ ఛేంజర్ స్టోరీ గురించి మాట్లాడుతూ ఒక ఐఏఎస్ కలెక్టర్ మరియు మినిస్టర్ మధ్య జరిగే వార్ గేమ్ ఛేంజర్ అని హింట్ ఇచ్చాడు. అలాగే రామ్ చరణ్ ఈ సినిమాలో నటించలేదని జీవించాడని దీంతో ఆడియన్స్ కి రీల్ స్టోరీ కాకుండా రియల్ గా అనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. చివరగా ఈ సినిమాకోసం పని చేసిన ప్రతీ టెక్నీషియన్స్ థాంక్స్ తెలిపాడు.