ఇండియ‌న్ 2 ఎఫెక్ట్‌: ఇండియ‌న్ 3 ఓటీటీ/థియేటర్ రిలీజ్పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శంకర్

ఇండియ‌న్ 2 ఎఫెక్ట్‌:  ఇండియ‌న్ 3 ఓటీటీ/థియేటర్ రిలీజ్పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శంకర్

1996 లో వచ్చి తెలుగు,తమిళ ఇండస్ట్రీలను షేక్ చేసిన మూవీ ఇండియన్(Indian). స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్  హసన్ హీరోగా వచ్చిన ఈ మూవీ ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. రూ.15 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ రూ.65 కోట్ల వసూళ్లతో చరిత్ర సృష్టించింది. ఆ ఇయర్ హైయెస్ట్ గ్రాస్సింగ్ మూవీగా నిలిచింది.ఇదిలా ఉంటే.. 

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా సీక్వెల్ ట్రెండ్ నడుస్తుంది. కల్ట్ క్లాసిక్ ఆయన ఇండియన్ సినిమాకి సీక్వెల్ అని ప్రకటించగానే ప్రేక్షకులకి ఆసక్తి పెరిగింది. ఎన్నో అడ్డంకుల దాటుకొని, దాదాపు 5 సంవత్సరాలు పాటు షూటింగ్ జరుపుకున్నఇండియన్ 2 మూవీ ఎట్టకేలకు జులై 12, 2024 లో విడుద‌లై పెద్ద ఫ్లాపైంది.

మాములుగా శంకర్ తీసుకున్న పాయింట్ బాగానే ఉన్న, స్క్రీన్ ప్లే, ఎలేవేషన్ సీన్స్ సరిగా లేకపోవడం, కథ బాగా సాగదీతగా ఉండటంతో పాటుగా అనిరుధ్ మ్యూజిక్ లో పసా లేకపోవడం.. ఇలా పలు కారణాల చేత ఇండియన్ 2 మూవీ భారీ డిసాస్టర్ గా నిలిచింది. 

ఇండియన్ 2 తో పాటుగా ఇండియన్ 3 కూడా ఒకేసారి తెరకెక్కించారు డైరెక్టర్ శంకర్. మొదట ఈ మూవీని వచ్చే ఏడాది (2025) ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీనిపై మూవీ టీమ్ కూడా ఎలాంటి ఆన్సర్ ఇవ్వకపోవడంతో ప్రేక్షకులు కూడా అదే నిజమని అనుకున్నారు. 

కానీ, ఇండియన్ 2 ప‌రాజ‌యంతో ప‌ని లేకుండా భార‌తీయుడు 3ని విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నారు శంక‌ర్. త‌మిళ మ్యాగ‌జైన్ విక‌ట‌న్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో.. భార‌తీయుడు 2 ప‌రాజ‌యంపై శంక‌ర్ తొలిసారి నోరు విప్పారు. ఈ ప‌రాజ‌యాన్ని తాను అస్స‌లు ఊహించ‌లేద‌ని అన్నారు. అలాగని ఇండియన్ 3ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామనే దాంట్లో నిజం లేదని అన్నారు. ఇండియన్ 3 థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని ఈ సందర్బంగా శంకర్ వివరించారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓటీటీ టాక్ కి ఎండ్ కార్డ్ పడింది. 

ఇండియన్ 2 సినిమాని లైకా ప్రొడక్షన్స్ రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. కానీ, కేవలం రూ.150 కోట్ల గ్రాస్ వసూల్ మాత్రమే చేసి తమిళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ప్లాప్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. కంగువ తర్వాత అత్యంత భారీ నష్టాలు తెచ్చిన సినిమాగా ఇండియన్ 2 నిలిచింది.