Shankar: గేమ్ ఛేంజర్ తరువాత శంకర్ భారీ ప్రాజెక్ట్.. స్టార్ హీరో కూడా ఫిక్స్!

Shankar: గేమ్ ఛేంజర్ తరువాత శంకర్ భారీ ప్రాజెక్ట్.. స్టార్ హీరో కూడా ఫిక్స్!

స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) ప్రస్తుతం ఇండియన్ 2(Indian 2) రిలీజ్ బిజీలో ఉన్నారు. జులై 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత రామ్ చరణ్(Ram charan) హీరోగా గేమ్ ఛేంజర్(Game changer) సినిమా చేస్తున్నారు శంకర్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా కూడా ఈ ఏడాది చివర్లో థియేటర్స్ లోకి రానుంది. 

అయితే.. ఈ రెండు సినిమాల తరువాత శంకర్ చేయబోయే సినిమాపై ఒక న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే.. ఈ రెండు సినిమాల తరువాత శంకర్ రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో పీరియాడికల్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారట. బాహుబలిని మించిన రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుందని టాక్. ఇక ఈ సినిమా కోసం తమిళ స్టార్ అజిత్ కుమార్ బును ఫిక్స్ చేశారట శంకర్. ప్రస్తుతం ఈ క్రేజీ కాంబో ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి అజిత్ కి కేవలం తమిళ్ లోనే కాదు దేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్ ఉంది. కానీ, ఎందుకో శంకర్ అజిత్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు.

అందుకే.. ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్టు కోసం అజిత్ కుమార్ ను తీసుకున్నాడట శంకర్. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుందని టాక్. మరి క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ఇండియన్ 2 సినిమా విషయానికి వస్తే.. జులై 12న విడుదల కానుంది. పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. హీరో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియభావాని శంకర్ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. లంచగొండితనం కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మంచి అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.