గేమ్ ఛేంజర్ నుంచి అప్డేట్..శంకర్ లేటెస్ట్ ట్వీట్ వైరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా శంకర్(Shankar) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ గేమ్ ఛేంజర్(Game Changer). ఈ మూవీలో కియారా అద్వానీ(kiara advani) హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు(Dil Raju) భారీ లెవెల్లో నిర్మిస్తున్నారు. లేటెస్ట్ సెన్సేషన్ ఎస్ థమన్(Thaman S) మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రధాన అంశంగా శంకర్ తెరకెక్కిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోందని మేకర్స్ తెలిపారు. డైరెక్టర్ శంకర్ నిన్నటి నుంచి (అక్టోబర్ 11) కీలకమైన ఎమోషనల్ సీన్స్ని షూట్ చేస్తున్నట్టు ట్విట్టర్ లో పేర్కోన్నారు. ఇక ఈ షెడ్యూల్ తోనే గేమ్ ఛేంజర్ ప్రధాన భాగం షూటింగ్ కంప్లీట్ అయ్యేలా శంకర్ ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఈ మూవీని 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. కానీ అది కుదిరేలా లేకపోవడంతో..2024 సమ్మర్లో రిలీజ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది.

రామ్ చరణ్ డ్యుయల్‌ రొల్స్ లో కనిపిస్తోన్న ఈ మూవీలో..అన్నీ క్రాఫ్ట్స్ నుంచి అవుట్ ఫుట్..గ్రాండ్ లెవెల్లో ఉండేలా ప్లాన్ చేశారని  సమాచారం. RRRతో గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్..తర్వాతి మూవీ గేమ్‌ ఛేంజర్‌ అవ్వడంతో.. భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. త్వరలో గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. 

పొలిటిక‌ల్ యాక్షన్ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్‌, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, జ‌య‌రాయ్‌, సునీల్, నవీన్‌ చంద్ర కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. గేమ్‌ ఛేంజర్‌ మూవీకి డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు స్టోరీ అందిస్తుండగా..సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు.