Bharateeyudu 2 : లంచం వార్తలు చూసినప్పుడల్లా సేనాపతే గుర్తొచ్చేవాడు: డైరెక్టర్ శంకర్

గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే క్లర్క్ నుంచి ఆర్డర్ లిచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో చూపించిన చిత్రం భారతీయుడు. 28 ఏళ్ల తర్వాత ఈ మూవీకి సీక్వెల్గా వస్తోన్న భారతీయుడు 2 (Indian 2) మూవీని శంకర్ ఎంతో ప్రేస్టీజియస్ ఫిల్మ్గా తెరకెక్కించాడు. ఇదివరకే రిలీజైన ఇండియన్ ఇంట్రో గ్లింప్స్ వీడియో, పోస్టర్స్ సేనాపతి అభిమానులని తెగ ఆకట్టుకున్నాయి.

ఈ భారతీయుడు 2 సినిమా ఈనెల (జూలై 12న) థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి ప్రీ రిలీజ్  ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శంకర్‌ మాట్లాడుతూ.. ‘ఇండియన్ 2 లో ఈ విశ్వనటుడు కమల్‌హాసన్‌ ఎంతో అద్భుతంగా నటించారని,అలాంటి నటుడు ఈ దేశంలో కాదు..ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరని దర్శకుడు శంకర్‌ అన్నారు. 

అయితే భారతీయుడు మూవీ రిలీజ్ అయ్యాక లంచం తీసుకున్నారన్న వార్తలు పేపర్లో చూసినప్పుడల్లా సేనాపతే గుర్తొచ్చేవాడు.ఆ టైమ్‌లో భారతీయుడు మళ్లీ తిరిగొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన తరుచు నా మదిలో వస్తుండేది. ‘రోబో 2.ఓ’ చేసే టైమ్‌లో ఈ ‘భారతీయుడు 2’ కథ తట్టడం..వెంటనే కమల్‌హాసన్‌తో పంచుకోవడం..సినిమా పట్టాలెక్కించడం జరిగాయి.

‘భారతీయుడు’ చిత్రీకరణ టైమ్‌లో మేము సేనాపతి పాత్ర లుక్‌ను కమల్‌ తండ్రి, సోదరుల ఫొటొల్ని చూసి సిద్ధం చేశాం. ఆ లుక్‌లో తొలిసారి తనని చూసినప్పుడు నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఆయన పెర్ఫార్మెన్స్  చూసి ప్రేక్షకులకు కూడా గూస్ బంప్స్ వస్తాయి. వరల్డ్‌‌‌‌లోనే ఆయనలా ఎవరూ కష్టపడరు. ఇందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్  ప్రతి ఒక్కరూ బెస్ట్ ఇచ్చారు’ అని చెప్పారు.