Shankar Daughter Wedding; అసిస్టెంట్ డైరెక్టర్తో శంకర్ కూతురి పెళ్లి .. వైరల్ అవుతున్న ఫొటోస్

Shankar Daughter Wedding; అసిస్టెంట్ డైరెక్టర్తో శంకర్ కూతురి పెళ్లి .. వైరల్ అవుతున్న ఫొటోస్

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) ఇంట పెళ్లి బాజాలు మోగాయి. తాజాగా ఆయన పెద్దకూతురు ఐశ్వర్య శంకర్ (Aishwarya Shankar) వివాహం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తరుణ్‌ కార్తీక్‌(Tharun karthik) తో జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ స్టార్స్ హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు. ఇక వరుడు తరుణ్ కార్తీక్‌ విషయానికి వస్తే.. చాలా కాలంగా ఆయన శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. వీరి పెళ్లి వేడుకకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇదిలా ఉంటే.. శంకర్ కుమార్తె ఐశ్వర్య కు ఇది రెండవ వివాహం. ఇంతకు ముందే ఆమెకు క్రికెటర్ రోహిత్ తో 2021లో పెళ్లి జరిగింది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.