సూర్య హీరోగా శివ తెరకెక్కించినచిత్రం ‘కంగువ’. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈచిత్రం ఈనెల 14న విడుదలవుతోంది.ఈ సందర్భంగా దర్శకుడు శివ సినిమా విశేషాలను గురించి ఇలా మాట్లాడారు..
దర్శకుడిగా నాకిది పదో చిత్రం. ‘సిరుతై’ (విక్రమార్కుడు రీమేక్) తర్వాత స్టూడియో గ్రీన్ సంస్థలో చేస్తున్న సినిమా ఇది. దీని కోసం రెండున్నరేళ్లుగా వర్క్ చేస్తున్నాం. పర్ఫెక్ట్ టెక్నికల్ మెథడ్స్‌తో త్రీడీ సినిమాల్లో బెస్ట్ అయ్యేలా తీశాం. రెండు టైమ్ ఫ్రేమ్స్‌లో సాగే చిత్రమిది. వెయ్యేళ్ల కిందటి వీరుడైన కంగువ ఇచ్చిన మాట ఏంటి, దాన్ని నిలబెట్టుకునేందుకు ఎంతటి సాహసం చేశాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పటికాలంలో ఫ్రాన్సిస్ క్యారెక్టర్ చూపిస్తున్నాం. కంగువకు జోడీ ఉండదు.
ఫ్రాన్సిస్‌కు జోడీగా డిఫరెంట్ షేడ్స్ ఉండే ఏంజెలీనా క్యారెక్టర్‌లో దిశా పటానీ నటించింది. తన పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఓ వీడియోలో బాబీ డియోల్ గారి స్వాగ్ నచ్చి రూత్‌లెస్ విలన్ అయిన ఉధిరన్ పాత్రకు ఎంచుకున్నాం.తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆయన ఈ చిత్రానికి ఎనర్జీ తీసుకొచ్చారు. సూర్య గారు చాలా సపోర్ట్ చేశారు. కొండల ప్రాంతంలో షూటింగ్ కావడంతో హిల్ క్లైంబింగ్ చేయాల్సి వచ్చేది. సూర్య కూడా మాతో నడుచుకుంటూ వచ్చేవారు. ఆయన మంచి జిమ్నాస్ట్ కూడా కావడంతో షూటింగ్ టైమ్‌లోఆ ఫిట్‌నెస్ హెల్ప్ అయింది. ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించాలని ప్రయత్నించాం.
దేవిశ్రీ ఇచ్చిన పాటలు, బీజీఎం సినిమాకు ఎంతో ఆకర్షణ తీసుకొచ్చాయి. అలాగే డీవోపీ వెట్రి అద్బుతమైన విజువల్స్ ఇచ్చారు. నాకు ఒక ప్రేక్షకుడిగా కమర్షియల్ సినిమా చూడటం ఇష్టం. దర్శకుడిగా వాటిని తీయడం ఇష్టం. ఈ సినిమా క్రియేటివ్‌గా, కమర్షియల్‌గా పర్ఫెక్ట్ బ్లెండింగ్‌లో ఉంటుంది. ఇందులో ఓ సర్‌ప్రైజింగ్ గెస్ట్ రోల్ ఉంది. అది సీక్వెల్‌కు లీడ్ ఇస్తుంది. అది ఎవరు చేశారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.